చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి దేశమంతా తిరిగి డప్పు వేసేందుకు ప్రయత్నించిన సీఐడీ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు అయింది. ఆయన ఇప్పటికే సస్పెన్షన్కు గురయ్యారు. ఏసీబీ కేసులో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి.
సీఐడీ మాజీ చీఫ్ గా పని చేసినా సంజయ్ ఎస్సీ, ఎస్టీ చట్టంపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశామని దానికి చాలా ఖర్చయ్యాయని ప్రభుత్వానికి బిల్లులు పెట్టి రూ. కోటిన్నరకుపైగా డ్రా చేసుకున్నారు. అలాగే కొన్ని గాడ్జెట్స్ కొన్నట్లుగా పత్రాలు సృష్టించారు. అవగాహన శిబిరాలకు ఖర్చేమీ కాలేదు. వాటిని సీఐడీ అధికారులే నిర్వహించారు. అలాగే గాడ్జెట్స్ కూడా కొనలేదు. కానీ డబ్బులు దండుకున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు కేసులు పెట్టారు.
అసలు ఈ అవినీతిని పట్టుకునే అతనిని సీఐడీ చీఫ్ గా నియమించి తాము చెప్పినట్లుగా వైసీపీ నేతలు చేయించుకున్నారన్న అనుమానాలు అధికారవర్గాల్లో ఉన్నాయి. అవినీతి చేసి దొరికిపోతే కేసులు పెట్టాలి కానీ వారితో తమకు అనుకూలంగా మరిన్ని నేరాలు చేయించుకోవడం వైసీపీ స్టైల్. మార్గదర్శి, చంద్రబాబు కేసులు, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల వ్యవహారాల్లో సంజయ్ వ్యవహరించిన శైలీ.. వైసీపీ కార్యకర్త కన్నా ఘోరంగా ఉంది.
ఇప్పుడు ఆయన పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. ఐపీఎస్ సర్వీస్ మానేసి మత బోధనలు చేసుకుని బతికేద్దామని అనుకున్నా చాన్స్ రాదు. చేసిన తప్పుడు పనులన్నీ బయటకు వస్తున్నాయి. జైలుకెళ్లి చాలా కాలం గడపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.