కడప జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేసుకుంది. పరిస్థితి బాగోలేదని గుర్తించి జగన్ ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేశారు. దాంతో టీడీపీకి అసలు పట్టు లేని చోట కూడా ఆ పార్టీకి చెందిన వాళ్లే సాగునీటి సంఘాల్లో పట్టు సాధించారు. తాజాగా కడప కార్పొరేషన్‌కు చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు.
ఇప్పటి వరకూ కడప కార్పొరేషన్లో ఒక్కరే టీడీపీ మెంబర్. ఆ మెంబర్ కూడా ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డికి వ్యతిరేకం కావడంతో సైలెంటుగా ఉంటారు. అయితే ఇప్పుడు మాధవీరెడ్డి అసలు కార్పొరేషన్ టీడీపీ చేతుల్లోకి వచ్చేలా చేస్తున్నారు. ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలోనే ఓ పది మంది టీడీపీలో చేరారు. ఇప్పుడు మిగతా వారిని కూడా ఆకర్షించి మేయర్ పీఠాన్ని టీడీపీ ఖాతాలో వేయాలన్న ప్లాన్లు అమలు చేస్తున్నారు.
ఇప్పటికే జడ్పీచైర్మన్ పీఠం పోతుందన్న ఉద్దేశంతో జగన్ అందర్నీ పిలిపించుకుని సర్దుబాటు చేశారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠం.. బిల్లుల కోసమైనా కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే వారందర్నీ ఎలాగోలా ఆపుతున్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం వచ్చినప్పుడు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు పరువు పోతుందని జగన్ ఫీలవుతున్నాయి. అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన ఎవరూ పార్టీ మారకుండా చూసుకుంటానని చెబుతున్నారు కానీ.. అందరూ పార్టీ మారిపోతున్నారు.