సంధ్యాధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ ను సవాల్ చేస్తూ హైదరాబద్ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని క్వాష్ పిటిషన్‌పై వాదనల్లోనే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారని పోలీసుల తరపు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సవాల్ చేయకపోతే తర్వాత ఇతర కేసుల్లోనూ పోలీసులకు చిక్కులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
అందుకే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్‌లో డివిజన్ బెంచ్ లోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో అయితే త్వరగా ఫలితం వస్తుందన్న ఉద్దేశంతో అక్కడే పిటిషన్ వేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని అర్జున్ తరపు లాయర్ వాదించారు. అయితే పోలీసులు పూర్తిగా సహకరించినా.. అసలు పోలీసుల సూచనలను పరిగణనలోకి తీసుకోనిది అర్జునేనని నిరూపించే సాక్ష్యాలతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నారు.
తొక్కిసలాట ఘటనకు పూర్తిగా ధియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమేనని పోలీసులు వాదిస్తున్నారు. టిక్కెట్లు కొనుక్కున్న వారిని తోసేసి.. తొక్కేసి.. అల్లు అర్జున్ తరపున వచ్చిన వారు కూర్చుకున్నారు. అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బంది అతితో మరిన్ని సమస్యలు వచ్చాయంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే.. మరింత సంచలనం అయ్యే అవకాశం ఉంది.