ఈమధ్య ‘విశ్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు కూడా గోపీ కెరీర్ బాగా స్ట్రగుల్స్ తోనే సాగింది. ‘భీమా’ ఓకే అనిపించుకొంది. అంతకు ముందు, ఆ తరవాత కూడా ఫ్లాపులే. అయినా సరే, తన చేతికి సినిమాలు అందుతూనే ఉన్నాయి. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో గోపీచంద్ ఓ సినిమా చేయాలి. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కథ కూడా రెడీ అవుతోంది.
ఇప్పుడు మరో కథకు కూడా గోపీచంద్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కుమార్ అనే కొత్త కుర్రాడు గోపీచంద్ కు కథ వినిపించడం, అది గోపీచంద్‌కు నచ్చడం జరిగిపోయాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి. రాధాకృష్ణ కథ రెడీగా ఉంది. ప్రొడ్యూసర్ ఎవరన్న విషయంలో మల్లగుల్లాలు జరుగుతున్నాయి. ముందు యూవీ అనుకొన్నారు. ఆ తరవాత 70 ఎం.ఎం దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు అక్కడ్నుంచి మరో సంస్థకు మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఓ క్లారిటీ అయితే రావాల్సివుంది.