పుష్ప 2 సూపర్ హిట్ అయినా సంధ్యా ధియేటర్లలో జరిగిన తొక్కిసలాట ఉదంతం, ఆనంతర పరిణామాల్ని డీల్ చేయడంలో సినిమా టీం పూర్తి స్థాయిలో విఫలం కావడంతో అనేక అంశాలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. తాజాగా ఆ కుటుంబానికి ప్రకటించిన రూ. పాతిక లక్షల సాయాన్ని కూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి. రూ. పది లక్షలు మాత్రమే ఇచ్చారని .. మిగిలిన మొత్తం పెండింగ్ పెట్టారని అంటున్నారు. బక్క బడ్సన్ అనే రాజకీయ నేత సోషల్ మీడియా ఇంటర్యూల్లో చెబుతున్నఈ మాట వైరల్ అవుతోంంది.
పుష్ప సినిమా టీం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఆర్థికంగా పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ప్రకటించింది. అల్లు అర్జున్ రూ.పాతిక లక్షల సాయం ఇస్తున్నట్లుగా వీడియోలో పేర్కొన్నారు. తర్వాత పలువురు సినిమా యూనిట్ కుసంబంధించిన వారు కలిశారు. అయితే ఆర్థిక సాయం అందచేసినట్లుగా కూడా ప్రకటించలేదు. కానీ పది లక్షలు మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. మరో వైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. అది చాలాఖర్చుతో కూడుకున్నది . ఈ వైద్యానికి కూడా ప్రభుత్వమే డబ్బులు కడుతోంందని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.
ఇటు ప్రకటింంచిన సాయం ఇవ్వలేదు.. కుటుంబాన్ని ఆదుకుంటామని.. ఆర్థికంగా చూసుకుంటామని ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సున్నితమైన ఈ అంశంపై పుష్ప సినిమా టీం మరింత ఉదారంగా స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.