పార్టీ నుంచి పారిపోయేవాళ్లు ఎక్కువ కావడంతో కొత్త వారిని చేర్చుకునేందుకు జగన్ రెడ్డి నిర్మోహమాటంగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చావులు, పెళ్లిళ్లకు మాత్రమే బయటకు వస్తున్నారు. ఈ కారణంగా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు ఎవరైనా ఆ పెళ్లిలో ఎదురుపడితే వెంటనే వాటేసుకుని చెవిలో .. అన్నా పార్టీలోకి వచ్చేయండి అని చెబుతున్నారు. ఆ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా చెబుతోంది.
బుధవారం కర్నూలులో ఓ పెళ్లికి జగన్ హాజరయ్యారు. అది వైసీపీ రెడ్డిగారి పెళ్లి కాబట్టి ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హెలికాఫ్టర్ మాట్లాడుకుని వచ్చారు. ఆయన వచ్చిన సమయంలో అనంతపురంకు చెందిన కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ ఎదురు వచ్చారు. అంతే ఆయనను ఆలింగనం చేసుకుని పార్టీలోకి వచ్చేయన్నా అని పిలిచారు. ఆ పిలుపు చూసి శైలజానాథ్ నవ్వుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఒక్కర్ని కాదు మొహమాటానికి పలకరించిన వారందరికీ అదే పిలుపు ఇస్తున్నారు జగన్.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో కొత్తగా ఎవరైనా పార్టీలో చేరాలంటే పది సార్లు ఆలోచించే పరిస్థితి. ఆయన పార్టీలో చేరి పాలేరుగా బతకడం కంటే.. కాంగ్రెస్ పార్టీలో లీడర్ గా బతకడం మేలని ఎవరైనా అనుకుంటారు. జగన్ రెడ్డి ఎవరినైనా పిలిచేటప్పుడు అన్నా .. అన్నా అంటాడు కానీ ఆయన అసలు ట్రీట్ మెంట్ మాత్రం.. పాలేరు కంటే ఘోరంగా ఉంటుందని ఆ పార్టీలో నేతలకు ఓ స్పష్టత ఉంది . ఆయన గురించి తెలిసిన నేతలకూ ఇంకా స్పష్టత ఉంది. అయినా జగన్ రెడ్డి తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.