సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో పాటలది ప్రధాన పాత్ర. ఓ పాట హిట్ అయితే ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది. వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా ఈ విషయంలో సరైన దారిలో వెళుతుంది. తొలి పాట గోదారి గట్టు వైరల్ అయ్యింది. క్యాచి ట్యూన్, లిరిక్స్, చాలా రోజుల తర్వాత రమణ గోగుల వాయిస్ ఇవన్నీ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాయి.
ఇప్పుడు ‘మీను’ పేరుతో రెండో పాటని వదిలారు. ఈ పాటకీ క్యాచి ట్యూన్ కుదిరింది. ముఖ్యంగా పాట ఎత్తుకోవడంలో ఓ గమ్మత్తు కనిపించింది. వెంకటేష్ లవ్ స్టొరీకి సంబంధించిన పాటది. ఈ లవ్ స్టొరీని తన మాజీ ప్రేమికురాలితో పాటు భార్య ముందే సరదగా చెప్పడం అనిల్ రావిపూడి మార్క్ ని గుర్తు తెచ్చింది.
బీమ్స్ పాడిన తీరు, అనంత శ్రీమ్ లిరిక్స్ పొందిక అందంగా వున్నాయి. వెంకటేష్ పోలీస్ అధికారిగా, మీనాక్షి చౌదరి ట్రైనీగా కనిపించింది. విజువల్స్ లో నేచురల్ లోకేషన్స్ కనిపించాయి. ఈ పాట కూడా వైరల్ అయితే ‘సంక్రాంతి వస్తున్నాం’కు సాలిడ్ ఆల్బమ్ దొరికేసినట్లే.