మున్సిపాలిటీలు, అసెంబ్లీల్లో కనిపించే హైడ్రామా సన్నివేశాలు ఇప్పుడు ఢిల్లీ పార్లమెంట్ లో కనిపిస్తున్నాయి. అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ప్రారంభించింది. తాను అంబేద్కర్ ను ఏమీ అనలేదని .. కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతం కావడంతో .. బీజేపీ కౌంటర్ ప్లాన్ చేసింది. చివరికి అది పూర్తిగా టాపిక్ ను డైవర్ట్ చేసింది. రాహుల్ పై కేసు నమోదు చేసేలా చేసింది. అదంతా గల్లీ స్థాయి రాజకీయాలతోనే సాధ్యమయింది.
పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద.. బీజేపీ ఎంపీలు ఆందోళనలు చేశారు. రాహుల్ గాంధీని లోపలికి పంపేందుకు సిద్ధపడలేదు. దీంతో ఆయన తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఇలా ఆయన తోసుకుని వెళ్లిపోయిన సమయంలో తాను కింద పడ్డానని ఓ ఎంపీ తలకు కట్టుకట్టుకుని ఆస్పత్రిలో చేరిపోయారు. మరో ఎంపీ మెడ పట్టేసిందని రాహుల్ గాంధీపై మండిపడ్డారు. రాహుల్ కుంగ్ ఫూ, కరాటేలు నేర్చుకుది ఇందుకేనా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గాయపడినట్లుగా చెబుతున్న ఎంపీని ఆస్పత్రిలో.. ఐసీయూలో చేర్పించారు బీజేపీ ఎంపీలు. తర్వాత నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ లోపల జరిగితే అన్నింటికీ స్పీకర్ దే అధికారం. సభ లో కాకుండా.. పార్లమెంట్ ప్రాంగణలో ఈ ఘటన జరిగింది. నిజానికి ఇక్కడ కూడా స్పీకర్ కంట్రోల్ లోనే ఉంటుంది. అయినా రాహుల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తర్వతా బీజేపీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ చూసిన వారికి గతంలో కోమటిరెడ్డి, సంపత్‌లపై అనర్హతా వేటు వేసేందుకు స్వామిగౌడ్‌తో చేసిన కన్ను ఆపరేషన్ ఘటన గుర్తుకు వస్తోందని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఏదైనా కానీ.. ఈ ఘటనతో అంబేద్కర్ ఇష్యూని పక్కకు పోయేలా చేయడంలో బీజేజపీ సక్సెస్ అయిందని అనుకోవచ్చు.