వైసీపీని బలోపేతం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి బీభత్సమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా లక్ష్మిపార్వతిని ప్రధాన కార్యదర్శిని చేసిన ఆయన తాజాగా గోరంట్ల మాధవ్ ను అధికార ప్రతినిధిగా నియమించారు. అధికార ప్రతినిధి అంటే… పార్టీ ఫేస్. ఆయన ఏం మాట్లాడిదే అతి ఆ పార్టీ విధానం అనుకోవాలి. అలాంటి బ్రాండ్ అంబాసిడర్ లాంటి పదవికి గోరంట్ల మాధవ్ ను జగన్ ఎంపిక చేశారంటే.. ఎంతో కసరత్తు చేసి ఉండాలి.
గోరంట్ల మాధవ్ సీఐగా ఉంటూ.. జేసీ బ్రదర్స్ పై మీసం మెలేయడంతో జగన్ రెడ్డికి నచ్చి ఎంపీ సీటిచ్చారు. గెలిచారు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఆయన లీలలు చూసి జనం జడుసుకున్నారు. జగన్ రెడ్డి కూడా కట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడా టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు మరో ఆప్షన్ లేదు. ఉద్యోగం తిరిగి రాదు. అందుకే వైసీపీలోనే కొనసాగుతున్నారు. అనంతపురంలో అసలు వైసీపీ నేతల మధ్య నలిగిపోతున్న ఆయనను యాక్టివ్ గాఉంచాలని పదవి ఇచ్చారు.
గోరంట్ల మాధవ్ తో ఇప్పుడు అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా అన్న సందేహం వైసీపీ క్యాడర్ లోనే ఉంది . ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కూడా చాలా బాగా ఉంటుందని.. వైసీపీ బ్రాండ్ ను ప్రజలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూంటారని అనుకుంటున్నారు. ఎంతైనా పార్టీ బలోపేతం కోసం జగన్ రెడ్డి చేస్తున్న నియామకాలు చూసి రాజకీయ వ్యూహాలంటే ఇవి అని అనుకోని వైసీపీ కార్యకర్త ఉండకపోవచ్చు.