హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో అన్ని ఆధారాలు చాలా పక్కాగా ఉన్నప్పటికీ చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఏ మాత్రం ముందడుగు పడటం లేదు. ఈ కేసులో ఒక్క విద్యాసాగర్ ను అరెస్టు చేస్తే ఆయన కూడా బెయిల్ పై వచ్చారు. పోలీసు వ్యవస్థను ఓ మాఫియాలా వాడుకున్న వారు మాత్రం ఇంకాబయటే ఉన్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేసుకుని వాయిదాలు వేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు.
సీఎంవో నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని వారు అంతర్గతంగా చెబుతున్నారని.. తమ కెరీర్ ను బలి పెట్టవద్దని .. పెద్ద స్థాయిలో ఒత్తిడిచేస్తున్నారని చెబుతున్నారు. అయితే అధికారంలో ఉన్న వారు చేసినా చేస్తారా.. అలాంటి వారు సర్వీసులు ఎలా అర్హులన్న వాదన వినిపిస్తోంది. ఓ బడా పారిశ్రామికవేత్తకు సంబంధించిన మ్యాట్రిక్స్ కావడంతో వీలైనంతగా సెటిల్ చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ విషయంలో జత్వానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విజయవాడకు వచ్చి పోలీసులకు కావాల్సిన సమాచారం ఇస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమెకు అందే న్యాయం కన్నా.. అసలు వ్యవస్థను దుర్వినియోగం చేసిన ఐపీఎస్‌లపై చర్యలనే ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు. కళ్ల ముందుఅన్ని సాక్ష్యాలూ స్పష్టంగాఉన్నా.. ఆమెపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధించారని స్పష్టమైనా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది సామాన్యుడికి అర్థంకాని ప్రశ్న.
ఇలాంటి విషయాల్లోనూ..బాధితులకు న్యాయం.. వ్యవస్థలను చెరబట్టిన వారికి శిక్షలు పడకపోతే.. ప్రజలు నమ్మకం కోల్పోతారు. ఇది చాలా ప్రమాదకరమని అనుకోవచ్చు.