కాకినాడ పోర్టును అప్పనంగా కొట్టేసిన కేసులో ఈడీ చాలా దూకుడుగా ఉంది. వివరాలు ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఆధారాలు లభించడంతో విజయసాయిరెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డికి, విక్రాంత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందాయి. అయితే ఈ ముగ్గురూ కడుపు నొప్పి, కాలు నొప్పి అని సాకులు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యార. ఈ విషయంలో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి మాఫియాలాగా మారి అరబిందోను ముందు పెట్టి కథ నడిపించారు. ఇష్టం వచ్చినట్లుగా ఆస్తులు రాయించుకున్నారు. ఇప్పుడు ఆ కేసుల్లో అడ్డంగా ఇరుక్కోబోయేది అరబిందో వారసుడే. అరబిందో ఫార్మా పెట్టి దిగ్గజంగా ఎదిగారు కానీ.. విజయసాయిరెడ్డి నీడ పడటంతో వారి పేరు ప్రఖ్యాతులన్నీ జైలు పాలవుతున్నాయి. లిక్కర్ కేసులో ఇప్పటికే జైలు పాలయి.. అప్రూవల్ గా మారి బెయిల్ తెచ్చుకున్న శరత్ చంద్రారెడ్డి.. విజయసాయిరెడ్డిని నమ్ముకుని ఏపీలోనూ అదే దందా చేయడంతో మరోసారి జైలుకెళ్లబోతున్నారు.
కాకినాడ పోర్టును కొట్టేసిన కేసులో ఈడీ నోటీసులు వచ్చేసరికి ఆయన తనకు అనారోగ్యం అని చెప్పి వెళ్లలేదు. ఒకసారి తప్పించుకోగలరు.. రెండు సార్లు తప్పించుకోగలరు..కానీ తర్వాత అయినా అరెస్టు కాక తప్పదు. పోర్టును అంత తేలికగా కొట్టేయడానికి జరిగిన లావాదేవీలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చేయించిన జగన్ర్ రెడ్డి బాగానే ఉంటారు. ఆయన వాటాలు ఆయనకు ఇవ్వడమో.. లేకపోతే బినామీలుగా ఉండటామో శరత్ చంద్రారెడ్డి చేస్తారు. కానీ అంతిమంగా జైలుకెళ్లేది కూడా ఆయనే. విజయసాయిరెడ్డి పాలపడిన అరబిందో కుటుంబం దౌర్భాగ్యం ఇలా తయారయింది.