ఐదేళ్ల పాటు వర్క్ ఫ్రం ప్యాలెస్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వ పని తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అంతా ప్రజల్లోనే ఉంటోంది. కష్టం వచ్చినా.. నష్టం వచ్చిన వెంటే ఉంటోంది. అది ముఖ్యమంత్రినా.. డిప్యూటీ సీఎంనా అన్నది మ్యాటర్ కాదు. మేమున్నామన్న భరోసా ఇస్తోంది. అదే ఆరు నెలల్లో ప్రజల ముందు కనిపించిన అసలైన మార్పు .
ప్రజల్లోనే సీఎం, డిప్యూటీ సీఎం
విజయవాడకు వరదలు వస్తే వరదల్లోనే చంద్రబాబు తిరిగారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు వస్తేపరిష్కరించడానికి వెళ్లారు. గిరిజనుల డోలీ మోతలు ఎందుకు తీరడం లేదని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించడానికివెళ్లారు. అక్కడ రోడ్ల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నిధుల సమస్య ఉండదు. కానీఅక్కడ ఉండే పరిస్థితులు, మావోయిస్టుల కారణంగా పనులు జరగవు. ఈ పరిస్థితిని మార్చడానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ ఆరు నెలల కాలంలో. సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్లోకి ఎన్ని సార్లు వెళ్లారో చెప్పలేం ఎందుకంటే.. వారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు బయలుదేరి వెళ్లిపోయారు.
ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్
ఎప్పుడైనా ఓ సీఎం, డిప్యూటీ సీఎం ప్రజల్లోకి వెళ్తున్నారంటే మొత్తం అలర్ట్ అయిపోవాలి. అలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు చేసే సేవల విషయంలో సమస్యలు రావు. ఇప్పుడు అదే కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారన్న భయంతో ఉద్యోగులు గట్టిగా పని చేస్తున్నారు. నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా పోయింది. అక్కడక్కడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగం అంటే పని చేయకూడదు అనే రూల్ పెట్టుకున్న వారిని గాడినా పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పనితీరుతో .. మొత్తం యాక్టివ్ ప్రభుత్వం ప్రజల కళ్ల ముందు ఉంది.
ఐదేళ్ల జడత్వాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు !
రాష్ట్రంలో పాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒక్క ప్యాలెస్ గుప్పిట్లో పెట్టుకుంది. కానిస్టేబుల్ ను కూడా సీఎంవో నుంచే నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో అంతటా జడత్వం ఆవరించింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం మానేశారు. ఈ విపరిణామం నుంచి పాలనను గాడినా పెట్టేలా చేయడంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి విజయం సాధించారు. ఇక ముందు వీరి పరుగును అందుకోవడానికి యంత్రాగం చాలా కష్టపడాల్సి రావొచ్చు. ప్రజలు కోరుకుంటున్నది కూడా ఇదే.