ట్యాబ్‌లు ఎక్కడ అంటూ జగన్ రెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఈ సారి కూడా చాట భారతమే కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్ తరహాలో సోషల్ మీడియాలో పెట్టారు. విద్యార్థులకు ట్యాబులు ఇవ్వట్లేదని ఆయన వాదన. మునిగిపోతున్న బైజూస్‌ను కూడా పిండుకోవడానికి ప్రయత్నించి పిల్లలకు పనికి రాని ట్యాబ్‌లు అంటగట్టిన ఆయన ఇప్పుడు తన చేయి పడగానే.. బైజూస్ పాతాళంలోకి వెళ్లిపోయిందనే విషయాన్ని మర్చిపోయారు. ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారనుకుని ఆయన మర్చిపోయారు. మామూలుగా అయితే ఆయనకు గుర్తు ఉంటుంది.
అసలు విద్యార్థులకు ట్యాబ్‌లు ఎంత అవసరం అన్నదానిపై స్పష్టత లేదు. వారేమీ ఆన్ లైన్ చదువులు చదవడం లేదు. నేరుగా క్లాసులకు వెళ్లి చదువుతున్నారు. ఇక ట్యాబ్‌లు ఎందుకు..?. పిల్లలకు ఫోన్లే ఇవ్వకూడదని నిపుణులు మొత్తుకుంటున్నారు. మరి నేరుగా ట్యాబులు ఇస్తే.. చదువుకే వాడతారా?. కేలవం ఎకడమిక్ అంశాలు మాత్రమే వచ్చేలా నియంత్రించి ట్యాబ్స్ ఇస్తామని చెప్పారు కానీ.. అలాంటిదేమీ లేద. చిన్న ట్రిక్ తో ఆ ట్యాబ్ ను దుర్వినియోగం చేయవచ్చు.
జగన్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ను సర్వనాశనం చేశారు. స్కూల్లలో రంగుల బల్లలు వేయించి అదే అభివృద్ధి అని చెబుతున్నారు. విద్యార్థుల కోసం ఒక్క టీచర్ ను నియమించలేదు కానీ.. వందల కోట్లను ట్యాబులు, సీబీఎస్ఈ, ఐబీ అంటూ తగలేశారు. ఆ డబ్బుల వల్ల విద్యార్థులకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. అయినా జగన్ రెడ్డి తన ట్వీట్లు మాత్రం ఆపడం లేదు. బైజూస్ దివాలా తీసింది. జగన్ లాగే రవీంద్రన్ కూడా చేతులెత్తేశారు.