రియల్ ఎస్టేట్ రంగంలో నగదు కొరత పెరిగిపోతోంది. బుకింగులు తగ్గి రొటేషన్ సమస్యలు వచ్చాయని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ సమస్యను అధిగమించడానికి పెద్ద పెద్ద కంపెనీలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సూపర్ మార్కెట్లు, బట్టల దుకాణాలు, గోల్డ్ షాపులు పాటించే గిఫ్టుల మార్కెటింగ్ స్ట్రాటజీని పాటిస్తున్నాయి. ఫ్లాట్ బుకింగ్ చేసుకుంటే తక్షణం గిఫ్ట్ ఇస్తామని.. తర్వాత బంపర్ డ్రా తీసి కార్లు ఇస్తామని ప్రకటిస్తున్నాయి.
హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోనూ భారీ ప్రాజెక్టులు చేపడుతున్న సుమధుర సంస్థ ఇదే ఆఫర్లు ప్రకటించి… విస్తృతంగా ప్రచారం చేస్తోంది. హోర్డింగులు ప్రకటించింది. ఈ సంస్థ బెంగళూరులో ఐదు, హైదరాబాద్ లో మూడు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వీటిలో ఫ్లాట్లు బుకింగ్ చేసుకున్న వారికి గిఫ్టులు ప్రకటించింది. ప్రతి బుకింగ్ మీద డైసన్ ప్రొడక్ట్స్, ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తామని చెబుతోంది. ఫైనల్ డ్రా తీసి గ్రాండ్ విటారా కారును విజేతకు ఇస్తామని చెబుతోంది.
డిసెంబర్ నెల టార్గెట్స్ అందుకోవడానికి సుమధుర ఈ ఆఫర్లును ప్రకటిచింది. డిసెంబర్ తో అయిపోయే అవకాశం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకూ ఇలాంటి ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. లిక్విడిటీ సమస్యను తీర్చుకోవడంతో పాటు స్లంప్ ను అధిగమించి వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా కొతం మొత్తాన్ని బహుమతుల రూపంలో ఖర్చు చేయకతప్పని పరిస్థితి రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఏర్పడుతోంది. ఒక్క సుమధురనే కాకుండా ఇతర కంపెనీలూ ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.