రాజకీయాలంటే సిగ్గు శరం లేకుండా ఒకరి అభిప్రాయాలతో పని లేకుండా .. వారికి ఎంత నష్టం చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా.. తమ పార్టీ కోసం వాడేసుకోవడం. తమ నాయకుడి బలం సరిపోదు.. అంత సీన్ లేదని పార్టీ క్యాడర్ కు గట్టి నమ్మకం ఉంటే వాడేసుకోండి అని సలహాలు వస్తాయి. వైసీపీ ఈ విషయంలో చాలా ముందు ఉంటుంది. జగన్ రెడ్డిని అభిమానించేవారే ఉండరని వాళ్లకి గట్టి నమ్మకం. అందుకే ఇతర పార్టీలపై ఉన్న వ్యతిరేకతే తన బలం అనుకుంటారు. ఇతర పార్టీల్లోని ప్రముఖ వ్యక్తుల కుటుంబీకులు తమ మద్దతుదారులని చెప్పుకునేందుకు చీప్ చీప్ ప్రయత్నాలు చేస్తూంటారు. మొన్నటిదాకా జూనియర్ ఎన్టీఆర్ ను అలా వాడేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ సంగతి చూస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఎలా వాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు ర్యాలీల్లో ఓ పది మంది వైసీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు పట్టుకొస్తారు. వెంటనే టీవీ9, ఎన్టీవీ బ్రేకింగులు వేస్తాయి. చంద్రబాబు ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా.. ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు అని. ఆ పది మంది వైసీపీ కార్యకర్తలే. ఇక ఫ్లెక్సీలు గురించి చెప్పాల్సిన పని లేదు. వేరే హీరో పోస్టర్ ను వాడుకోవడం పరువు తక్కువ అనే భావన వారికి రాదు. వాడేసుకుంటారు. ఎన్టీఆర్ ఫోటో వాడి ఎన్ని ఫ్లెక్సీలు కట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో వైసీపీని అసోసియేట్ చేసుకున్నారు. హీరో స్పందిస్తే మరింత రచ్చ చేయవచ్చని అనుకున్నారు.
ఇప్పుడు వీరంతా అల్లు అర్జున్ మీద పడ్డారు. జగన్ పుట్టిన రోజు జరుపుకుంటే.. ఆయన ఒక్కడికి ఫ్లెక్సీలు పెట్టడం అవసరమా అన్నట్లుగా అల్లు అర్జున్ ను కలుపుకున్నారు. ఇప్పుడు వివాదంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎలా చేసినా.. అల్లు అర్జున్ ను మరింతగా ఇబ్బంది పెట్టాలని ఆ కుటుంబం నుంచి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా అయితే జగన్ కు దగ్గరవుతారని వాళ్ల కావొచ్చు. అదేం లాజిక్ అనేడౌట్ వారికి రాదు. అదంతే ..కుటుంబాల్లో చిచ్చుపెడితే వాళ్లకు అదో ఆనందం. ఇలాంటి వారి ట్రాప్ లో ఫ్యాన్స్ పడితే తమ హీరోలకు అన్యాయం చేసినట్లే కానీ…. అభిమానించినట్లు కాదు.