ఒక ఊరిలో, రైడ్, రాక్షసుడు సినిమాలతో ఆకట్టుకొన్న దర్శకుడు రమేష్ వర్మ. ‘కిలాడీ’ ఫ్లాప్ అయినా, మేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వరుస సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవల లారెన్స్ తో ఓ సినిమా ఓకే అయ్యింది. ‘కాలభైరవ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఓ బాలీవుడ్ హీరోకి కథ చెప్పి ఒప్పించాడు. అజయ్ దేవగన్ తో రమేష్ వర్మ ఓ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఏ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఏ స్టూడియోతో ఓ బాలీవుడ్ సంస్థ కూడా చేతులు కలపబోతోంది. ఈ సినిమాకు దాదాపుగా రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నట్టు టాక్. లారెన్స్ తో సినిమా కూడా భారీ బడ్జెట్ ప్రాజెక్టే. లారెన్స్ కెరీర్లోనే క్లాస్ట్లీ సినిమాగా నిలవబోతోంది. ఇప్పుడు అయ్ దేవగణ్ సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో తీయబోతున్నారు. ఇటీవల అజయ్ దేవగన్‌ని కలిసి కథ చెప్పి వచ్చారు రమేష్ వర్మ.
జనవరి నుంచి లారెన్స్ సినిమా పట్టాలెక్కబోతోంది. ఫిబ్రవరిలో అజయ్ దేవగన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది. సెప్టెంబరులో షూటింగ్ ఉండొచ్చు. ఇదో సూపర్ హీరోకి సంబంధించిన కథ అని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. ‘కాలభైరవ’ కూడా విజువల్స్ గ్రాండియర్ ఉన్న సినిమానే. అందుకే రూ.150 కోట్ల వరకూ ఖర్చు పెట్టబోతున్నట్టు సమాచారం.