సీనియర్ హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. విలేకరిపై దాడి కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
బేసిక్ గా బెయిల్ కోసం కోర్టు లో వాదనలు వినిపించినపుడు అనారోగ్య సమస్యలని చూపుతుంటారు. మోహన్ బాబు కేసులో ఇదే వాదనలు వినిపించారు ఆయన తరపు లాయర్లు. మోహన్‌బాబు అనారోగ్యంతో ఉన్నారని, గుండె, నరాల సంబంధిత సమస్యలు వున్నాయని చెప్పారు.
ఇదే సందర్భంగా మోహన్ బాబు కి మతిమరుపుతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టి తీసుకురావడం కాస్త వింతగా వుంది. ఆయనకి సంబధించిన ఇలాంటి సమస్య ఎప్పుడూ బయట ప్రపంచానికి చెప్పలేదు.
ఏదేమైనా దాడి ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసే వాదనలే నిలబడ్డాయి. న్యాయస్థానం మోహన్‌బాబు ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.