108 అంబులెన్సుల్లో అరబిందో దందా.. కాకినాడ పోర్టులో అరబిందో దందా.. క్రికెట్ అసోసియేషన్లో అరబిందో దంతా.. విశాఖలో భూముల దందా.. చివరికి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కి బొగ్గు సరఫరాలోనూ అదే దందా. ఎక్కడ చూసినా అరబిందో .. అనుబంధ కంపెనీల దోపిడీనే కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కి అరబిందో అనుబంధ కంపెనీ సరఫరా చేసిన బొగ్గులో దాదాపుగా రూ. నాలుగు వందల కోట్ల స్కాం జరిగిందని బయట పెట్టారు.
మట్టి, మశానం కలిపిన బొగ్గును సరఫరా చేయడంతో విద్యుత్ ప్లాంట్ సామర్థ్యం నలభై శాతం తగ్గిపోయింది.దాంతో విద్యుత్ ఉత్పత్తి లేక బయట నుంచి కొనాల్సి వచ్చింది. దాని వల్ల అదనపు భారం పడింది. ఇది ఒక్కటి కాదు. ప్రతి దాంట్లోనూ అరబిందో లింకులు బయట పడుతున్నాయి. చివరికి అంబులెన్స్లలోనూ దోపీడీ చేశారు. కాకినాడ పోర్టును రాయించుకున్న విధానంపై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సెజ్ ను కూడా కొట్టేసింది. విశాఖలో కొన్ని రిసార్టులతో పాటు ఔరో రియాలిటీ కొన్ని భూలావాదేవీలు కూడా చేసినట్లుగా గుర్తించారు. అన్నీ కలిసి అరబిందో చాలా పెద్ద ఎత్తున దోపిడికీ పాల్పడిందని సులువుగానే అర్థమవుతోంది.
ఈ అరబిందో పైకి కనిపించేది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరడి కంపెనీ. ఆయన ఇప్పటికే లిక్కర్ కేసులో జైలుకెళ్లారు. ఆయనను అడ్డం పెట్టుకుని ఏపీలో విజయసాయిరెడ్డి భయంకరంగా దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అందుకే వి.సా.రెడ్డి వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో అసలు సినిమా చూపించనున్నారు. దోపిడీ మొత్తం ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది..