ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ను పెంచడానికి,ఇళ్ల నిర్మాణం జోరందుకునేలా చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇళ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తోంది. ఐదు అంతస్తుల వరకూ ఇక పర్మిషన్లు అక్కర లేదని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి లేఔట్ అప్ లోడ్ చేసి.. రుసుము చెల్లిస్తే అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేసింది. సాధారణంగా ఐదు అంతస్తులు అంటే అపార్టుమెంట్లు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు అపార్టుమెంట్లు నిర్మించుకోవాలంటే అనుమతుల కోసం ఎదురుచూడాలి. టౌన్ ప్లానర్లు లంచాలు డిమాండ్ చేస్తారు.
ఇక ఏపీలో అందరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండేలా భవనం ప్లాన్ ను రూపొందించుకుని ఆన్ లైన్ లో అప్ లోడ్ చూసి రుసుము చెల్లిస్తే అనుమతి వచ్చేసినట్లే అనుకోవచ్చు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ వర్గాలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏపీలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో అనుమతులు సాధారణ ప్రజలకు కూడా పెద్ద తలనొప్పి. ఇప్పుడు అలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం కలుగుతుంది.
ప్రజలు ఎక్కువగా ఏ అంశంపై ఇబ్బంది పడతారో దాన్ని గుర్తించి సాల్వ్ చేస్తే వారికి ఎంతో సమయం, ధనం ఆదా అవుతుంది. భవన నిర్మాణ నిబంధనలను పాటిస్తూ బిల్డర్లు, సాధారణ ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టుకుంటే.. ఏ సమస్యా ఉండదు. ఫీజులు కట్టాల్సి వస్తుందని రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు కట్టేస్తూ ఉంటారు. దాని వల్ల సమస్యలు వస్తూంటాయి. మున్సిపాలిటీకీ కట్టాల్సిన ఫీజులు కట్టేస్తే చాలా వరకూ సమస్యలు రాకుండా భవనాలు సేల్ గా ఉంటాయి.