జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులుగా చెలామణి అయినవారికి చట్టబద్దంగా చుక్కలు చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడా తొందరపాటు అనేది లేకుండా పక్కాగా ఆధారాలు సేకరించి మరీ కేసులు పెడుతున్నారు. ఒకే రోజు ఐపీఎస్ అధికారి సంజయ్, ఐఆర్ఎస్ అధికారి విజయ్ కుమార్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. వీరిద్దరి చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు.
ఐపీఎస్ హోదాలో సంజయ్ నేరుగా డబ్బులు కాజేశారు. సదస్సులు పెట్టకపోయినా పెట్టినట్లుగా బిల్లులు పెట్టి కోటిన్నర కొట్టేశారు. ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లు కొనసకపోయినా కొన్నట్లుగా బిల్లులు పెట్టి తన బినామీ కంపెనీల ఖాతాల్లోకి డబ్బులు పంపేశారు. విజిలెన్స్ విచారణలో పక్కాగా దొరకడంతో నివేదిక ఏసీబీకి వెళ్లింది. వారు కేసు నమోదు చేశారు. రేపోమాపో అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా పని చేసిన విజయ్ కుమార్ రెడ్డి అనే ఉద్యోగి చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంపై వాలిపోయిన ఆయన ప్రకటనలు అంటే సాక్షికి .. జగన్ కు బాకా కొట్టే మీడియాకు మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. ఇందు కోసం నిబంధనలు ఉల్లంఘించారు. ఆయనపైనా కేసులు నమోదయ్యాయి.
ఇంకా పలువురు అధికారులపై విచారణ జరుగుతోంది.ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు చేసిన నిర్వాకాలను వదిలి పెట్టే అవకాశం లేదు. కక్ష సాధింపులు అనే అవకాశం లేకుండా ఫ్రేమ్ చేస్తున్నారు. ఈ విషయంలో బయటపడటానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు కాస్తమెత్తగా ఉన్నా క్యాడర్ విరుచుకుపడుతోంది. అందుకే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొత్త ఏడాదిలో చాలా మంది జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులు …తమ కెరీర్లో చేసిన తప్పులను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.