బీఆర్ఎస్ సోషల్ మీడియా అల్లు అర్జున్ కు సపోర్టుగా ఉంటూ ప్రభుత్వంపై బురదచల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో వికటిస్తున్నాయి. అవి ఆ పార్టీకి పెద్దగా నష్టం చేయవు కానీ అల్లు అర్జున్ ను మాత్రం మరితంగా మునిగిపోయేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ రాక ముందే తొక్కిసలాట జరిగిందంటూ ఓ చిత్రమైన కథతో బీఆర్ఎస్ సోషల్ మీడియా హఠాత్తుగా ట్రెండ్ చేసింది. దానికి సాక్ష్యం ఏమిటంటే ఓ సీసీ టీవీ క్లిప్ మీద ఉన్న టైమింగ్.
ఎక్కడో హీరో ఉంటే ధియేటర్లో ఎలా తొక్కేసుకుంటారు?
అసలు అక్కడ ఏం జరిగిందో పోలీసులు చెప్పారు . అల్లు అర్జున్ చెప్పాడు. ఆయన టీం చెప్పింది. కోట్ల మంది చూశారు. ఇప్పుడు కొత్తగా అసలు అర్జున్ రాక ముందే తొక్కిసలాట జరిగిందనే నెరేటివ్ ను స్ప్రెడ్ చేయాలని అనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి?. ఓ సీసీ టీవీ కెమెరాలో టైమింగ్స్ మార్చడమో.. ఫేక్ చేయడమో చేస్తే అసలు జరిగింది అంతా తప్పు అని అందరూ నమ్మేస్తారా? . అల్లు అర్జున్ ధియేటర్ కు రాక ముందే ఎలా తొక్కిసలాట జరుగుతుంది. హీరో వస్తున్నాడని .. ఎక్కడో రెండు కిలోమీటర్ల అవతల ఉంటే ధియేటర్లో తొక్కేసుకుంటారా?
ముందే ఆ ఘటన జరిగి ఉంటే అల్లు అర్జున్ అక్కడికి అసలు చేరుకునేవాడా?
అసలు అల్లు అర్జున్ రాక ముందే తొక్కిసలాట జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఆలోచించలేరా?. తొక్కిసలాట జరిగి ఓ మనిషి చనిపోతే.. మరో పిల్లవాడి పరిస్థితి అంత సీరియస్ గా ఉంటే..ఏ సెలబ్రిటీ అయినా అక్కడకు మళ్లీ జన సందోహంతో వచ్చే పరిస్థితి ఉంటుందా?. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా తెలంగాణలో జనం.. ఉంటారని అనుకుంటారా?
రాజకీయాలకే కాదు ఫేక్లకూ పావుగా అల్లు అర్జున్ – ఇక వదలరా ?
ఓ పార్టీ సోషల్ మీడియా నడుపుతున్నంత మాత్రాన.. తమ పార్టీ కార్యకర్తలు తాము ఏం చెప్పినా నమ్ముతారని భావిస్తే మొదటికే మోసం వస్తుంది. ఒక సారి నమ్ముతారు.. రెండు సార్లు నమ్ముతారు. అసలు మొత్తం ఫేక్ చేసుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుంది. ఈ ఫేక్ మీడియాకు అల్లు అర్జున్ పై ఎలాంటి అభిమానంలేదు. రాజకీయం కోసం ఆయనను పావుగా వాడుకుంటున్నారు. ఈ ఫేక్ ప్రచారంలో అల్లుఅర్జున్ హస్తం కూడా లేదు. ఆయనకు తెలియదు కూడా. కానీ ఆయనకు వీరు తీవ్ర నష్టం చేస్తున్నారు. ఆయన జైలుకెళ్లినా పర్వాలేదు.. తమ రాజకీయం కోసం కాంగ్రెస్ సర్కార్, పోలీసుల్ని బ్లేమ్ చేస్తే చాలని వీరి తపన.