ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి లో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీపీసీఎల్ యాజమాన్యం నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి తెలియజేస్తూ ఓ లేఖ రాసింది.ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కోస్తా తీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన ముందస్తు పనులు చేపట్టేందుకు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.
ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తారు. రిఫైనరీకి భూసేకరణతో పాటుగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. అలాగే పర్యావరణ అంశాలు, ఇంజనీరింగ్ డిజైన్లు వంటివి ప్రీ ప్రాజెక్టు యాక్టివిటీస్ కిందకు వస్తాయి. ప్రాజెక్టుకును మచిలీపట్నంలో పెట్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే అన్నీ పరిశీలించుకుని రామయపట్నం అయితే అనుకూలం అని బీపీసీఎల్ ప్రతినిధులు నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
రిఫైనరీ ఏర్పాటు కోసం ఏపీతో పాటుగా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కూడా పరిశీలించారు. అయితే సీఎం నారా చంద్రబాబునాయుడుతో ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీకి వచ్చేలా చేసారు. రిఫైనరీ, పెట్రోకెమికల్ కారిడార్ నిర్మాణం కోసం సుమారుగా 4 వేల నుంచి 5 వేల వరకూ ఎకరా భూమి అవసరమవుతుందని అంచనా ఉంది.