వైసీపీ హయాంలో శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీ ను దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను పెద్దజీయర్ తరపున విదేశీ కరెన్సీని లెక్కించేవాడు. ఓ సారి నగదు తీుసుకెళ్తూ దొరికిపోయాడు. కేసు పెట్టారు. అయితే ఈ కేసును లోక్ అదాలత్లో టీటీడీ అధికారులు పరిష్కరించుకున్నారు. ఇది లోక్ అదాలత్లో పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కాదు. దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి కేసు. మరి ఆ కేసు ఎందుకు పరిష్కరించుకున్నారు ?
ఈ రవికుమార్ కు చెందిన ఆస్తులు రూ. వంద కోట్ల వరకూ అంతకు ముందే అప్పటిటి టీటీడీకి చెందిన కొంత మంది పెద్దల పేర్లకు మారిపోయాయి. అందుకే ఉపసంహరించుకున్నారని ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. భానుప్రకాష్ రెడ్డి టీటీడీ చైర్మన్ కు ఈ అంశంపై దర్యాప్తు చేయించాలని ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో భాను ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
రవికుమార్ అనే వ్యక్తి పొట్టలో ప్రత్యేక పెట్టించుకుని విదేశీ కరెన్సీని బయటకు తరలించేవాడని భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన రూ. రెండువందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తరలించి ఉంటారని అంటున్నారు. పొట్టలో పెట్టించుకున్న ప్రత్యేక అర ద్వారా భద్రతా సిబ్బందిని ఏమార్చేవారని అంటున్నారు. టీటీడీ సభ్యుడు అయిన భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలో లోకల్. తిరుమలలో జరిగే వ్యవహారాలపై ఆయనకు క్లారిటీ ఉంటుంది. ఈ రవికుమార్ వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణలపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆ రవికుమార్ నిజంగానే పొట్టలో ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసుకుని ఉంటే మాత్రం చిన్న విషయం కాదు.
టీటీడీ విషయంలో దేవుడిని దోపిడి చేయడానికి ఎన్నో కొత్త మార్గాలను గత ప్రభుత్వంలో అన్వేషించారు. ఇప్పుడు కూడా అలాంటివి కొనసాగితే దేవుడిని కూడా మోసం చేసినట్లే అవుతుంది.