పేర్నినాని పరారీలో ఉన్నారు. కుటుంబాన్ని తీసుకుని ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన తరపున లాయర్లు పిటిషన్లు వేస్తున్నారు. వారు కూడా విచిత్రంగానే ఉన్నారు. పేర్ని నాని, కిట్టుకు ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ నోటీసుల సమయం ముగిసిపోయిన తర్వాత ఆ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి కూడా లాయర్ ను ఇదేందయ్యా అని అడగాల్సిన వచ్చింది. దాంతో పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
ఇలాంటి ప్రయత్నాల మధ్య పేర్ని నానికి మరో బ్లాస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన తన నియోజకవర్గ ప్రజల్ని మోసం చేశారు. హమీద్ ఇచ్చి మోసం చేస్తే సరేలే అనుకుంటారు కానీ.. హామీలు అమలు చేశామని చెప్పుకోవడానికి ఏకంగా నకిలీ ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు వేల నకిలీ ఇంటిపట్టాల్ని ముద్రించి ఓటర్లకు పంచారు. ఈ విషయం ఇప్పుడు కేసుల దాకా వచ్చింది. దీనిపై పోలీసులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ల నుంచి బియ్యం కొట్టేశారు. తర్వాత డబ్బులు కడతామని చెప్పి కొంత కట్టారు. కానీ దొరికిన దొంగ సొమ్ము తిరిగి ఇచ్చేస్తే కేసు కాదా ఆని ప్రశ్నిస్తున్నారు. కనిపిస్తే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన కనిపించడం లేదు. కేసుల మీద కేసులు వస్తే.. ఇక కనిపించుకండా పోతారేమోనని మచిలీపట్నంలో జనం సెటైర్లు వేసుకుంటున్నారు. అయినా అధికార పార్టీలో ఉండి.. అసలైన పట్టాలు ఇప్పించవచ్చు కదా.. ఇలా నకిలీ పట్టాలు ఇవ్వడమెందుకన్న సందేహం చాలా మందికి వస్తోంది.