ఓ గొప్ప సక్సెస్ చూసిన తన కొడుకు కనీసం సంతోషంగా లేడని ఓ మూలన కూర్చుంటున్నాడని ఓ తండ్రిగా తనకు ఇది మనోవేదన కలిగిస్తోందని అల్లు అరవింద్ ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పారు. నిజమే కష్టపడింది ఈ సక్సెస్ కోసమే. కానీ అనాలోచితంగా చేసిన ఓ పని కారణంగా సక్సెస్ సంగతి తర్వాత ఇప్పుడు మనశ్శాంతి కూడా కరవైంది. అసలు ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది.
శిల్పా రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి నంద్యాల ఎన్నికల బరిలో ఉన్నాడు. ఆయనకు గెలుపుపై డౌట్ ఉంది. జనసేన ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమయింది. కౌంటర్ గా బన్నీని రంగంలోకి దింపాలనుకున్నాడు. ఫ్రెండ్ షిప్ ను వాడుకున్నాడు. బన్నీ మైండ్ సెట్ ను ఆయన వాడుకున్నాడు. బంధువులకన్నా ఫ్రెండ్సే ఎక్కువ అన్నట్లుగా ఉండే బన్నీ భార్యను తీసుకుని మరీ నంద్యాల వెళ్లాడు. ఆ వెళ్లిన టైమింగ్ కూడా రాంగే. పవన్ కోసం అందరూ పిఠాపురం వెళ్తున్న సమయంలో ఆయన నంద్యాల వెళ్లాడు. తనస్నేహితుడ్ని శిల్పా రవి రాజకీయంగా వాడుకున్నాడు. అది అర్జున్ కు మొదటి సమస్య.
ప్రీమియర్ షోకు కూడా శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకెళ్లాడు. అక్కడ తొక్కిసాలట జరిగింది. అక్కడికి నంద్యాల నుంచి అభిమానుల్ని శిల్పా రవి తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వైసీపీ జెండాలు కనిపించాయి. అంటే శిల్పా రవి ఈ ఇష్యూని ఎక్కడి దాకా తీసుకెళ్లారో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసింది చాలక వైసీపీ రాజ్యసభ సభ్యుడు, లాయర్ నిరంజన్ రెడ్డి తన తెలివితేటలతో మరింతగా అర్జున్ ను ఇరకాటంలో పెట్టారు. మొత్తం పోలీసు వ్యవస్థకు బన్నీని వ్యతిరేకం చేసి పెట్టారు. ఇది అక్కడితో ఆేగేది కాదు. పోలీసుల సహకారం లేకపోతే సినీ హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు.
ఎప్పుడైనా కుటుంబం కన్నా ఫ్రెండ్స్ ఎక్కువ అనుకున్నారో.. ఆ ఫ్రెండ్స్ రాజకీయంగా ఎలా వాడుకున్నారో అప్పుడే అసలు సమస్య వచ్చింది. దీన్ని బన్నీ గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తించారో లేదో తెలియదు.