జగన్ రెడ్డి వాలంటీర్లు ఏం చేసేవారో అందరికీ తెలుసు. ఏపీలో ప్రతి ఇంటికీ తెలుసు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దాన్ని ప్రైవేటు అవసరాలకు ఉపయోగించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు ఉపయోగించారు.ఇదే విషయాన్ని ఆయన ఓడిపోయిన ఏడాదికి అంతర్జాతీయ సమాజానికి చెబుతోంది అల్ జజీరా అనే అంతర్జాతీయ మీడియా సంస్థ.
వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను నిలిపివేశారని కొంత మంది కోర్టుకెళ్లిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్టడీ చేశారు. ఏడాది పాటు సదరు మీడియా సంస్థ ప్రతినిధి పరిశోధన చేసి చాలా విషయాలు కనిపెట్టారు. అయితే అవన్నీ లోకల్ లో అందరికీ తెలిసినవే. వాలంటీర్ల సాయంతో ఎంత ఘోరంగా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలనుకున్నారో పదేళ్ల పాటు ఈ అకృత్యాలు ఎలా సాగాయో వివరించారు.
ఇక్కడ ఆ మీడియా సంస్థ చెప్పాలనుకున్నదేమిటంటే.. ఓ చట్ట విరుద్ధమైన వ్యవస్థ ఇంత విచ్చలవిడిగా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే దేశంలో పేరుమోసిన ఏ ఒక్క వ్యవస్థ కూడా దాన్ని ఆపలేకపోయిందని. అదే అభిప్రాయాన్ని నేరుగా అంతర్జాతీయ సమాజంలోకి పంపేసింది అల్ జజీరా. దేశంలో వ్యవస్థలు … అధికారం ఉన్న వారి చేతిలో ఉంటాయని.. అవి నడిచే వాటికోసమేనన్నట్లుగా చెప్పారు. ఇందులో నిజం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.
జగన్ రెడ్డి మరోసారి తన ప్రజాస్వామ్యంలో నియంత స్వభావాన్ని అందరికీ తెలిసేలా చేసుకున్నారు. ఈ ఇమేజ్ అంత తేలికగా పోదు.