కంగువా ఫలితంతో డీలా పడ్డ సూర్య.. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ సినిమాపై దృష్టి పెట్టాడు. ఇది సూర్యకి 44వ సినిమా. స్వయంగా ఆయనే నిర్మిస్తున్నాడు. ఈ రోజు సినిమా టైటిల్ ని రివిల్ చేశారు. సినిమాకి రెట్రో అనే టైటిల్ పెట్టారు. దాదాపు రెండు నిమిషాల నిడివిగల టీజర్ తో టైటిల్ ని ప్రకటించారు. టీజర్ అంటే హడావిడి షాట్లు కనిపిస్తున్నాయి. కానీ రెట్రో టీజర్ మాత్రం డిఫరెంట్ గా కట్ చేశారు. ఈ సినిమా కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లెస్ చేశారు.
ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అయినప్పటికీ ప్రేమకథ కీలకం. సూర్య, పూజ ప్రేమికులు. సూర్యకి హింసాత్మకమైన గతం వుంది. ప్రేమ కోసం అన్నీ త్యాగం చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని గతం జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అతను కోరుకున్న జీవితాన్ని గడిపాడా? లేదా గ్యాంగ స్టర్ బాట పట్టాడా ? అనేది అసలు కథ.
సూర్య లుక్, ఎటైర్ బావుంది. యాక్షన్ కూడా బాగానే దట్టించారు. పూజకి చాలా రోజుల తర్వాత కీలకమైన పాత్ర పడిందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. కార్తిక్ సుబ్బరాజు కథలు పైకి సింపుల్ గా కనిపిస్తాయి కానీ ఎమోషనల్ డెప్త్ వుంటుంది. రెట్రో లో కూడా అలాంటి పాయింట్ ఎదో కుదిరినట్లే కనిపిస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.