సినీ ప్రముఖులంతా కలసి సీఎం వద్దకు వెళ్తున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారు అియంది. 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరుగుతుదంి. దిల్ రాజుచిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఇతర నిర్మాతలు, దర్శకులు హాజరవుతారు . ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ కూడా హాజరవుతారు.
ఇటీవలి పరిణామాల కారణంగా ఈ భేటీ హైలెట్ గా నిలవనుంది. అల్లు అర్జున్ కేసు వ్యవహారం తర్వాత టాలీవుడ్ కు.. ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందని అనుకున్నారు. నిజానికి గ్యాప్ ఉండేంత పెద్ద సంబంధాలను కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇప్పటి వరకూ టాలీవుడ్ ఏర్పాటు చేసుకోలేదు. ఈ కారణంగా టాలీవుడ్ చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఎప్పటికప్పుడు సహకారం లభిస్తున్నా.. ప్రభుత్వానికి టాలీవుడ్ వైపు నుంచి సపోర్టు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటన మొత్తం వ్యహారాన్ని మలుపు తిప్పింది.
గురువారం టాలీవుడ్ ప్రముఖుల భేటీ..రేవంత్ తో సుహృద్భావంతో జరుగుతుందనడంలో సందేహం లేదు. రేవంత్ రెడ్డిని మెప్పించేందుకు సినీప్రముఖులు చేయగలిగినంత చేస్తారు. తమ ప్రభుత్వం ఉన్నా ఇంకా బీఆర్ఎస్ కు దగ్గరగా ఉన్నారన్న అసంతృప్తి మాత్రమే రేవంత్ కు ఉండే అవకాశం ఉంది. ఈ భేటీతో అది కూడా తీరిపోతుందని అంచనా వేస్తున్నారు.