మనీ లాండరింగ్ ఆరోపణలపై వైఎస్సార్‌పార్టీ అధినేత జగన్మోహన రెడ్డికి చెందిన 749 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట కట్టడి, ప్రకటించడం రాజకీయంగా వారికి చాలా నిరుత్సాహం కలిగిస్తున్నది. సామూహిక ఫిరాయింపులతో ఇప్పటికీే కొంత డీలా పడిన వైసీపీ వ్యూహం కోసం పెనుగులాడుతున్నది. అది ఒక కొలిక్కి వచ్చి నిలదొక్కుకోండానే బుధవారం హఠాత్తుగా ఇడి ఈ ఎటాచ్మెంట్ ప్రకటించింది.. కేంద్ర బిజెపి కారణంగా కేసులు కొంచెం నెమ్మదిగా నడుస్తున్నాయని వారు భావిస్తున్న తరుణంలో పులిమీద పుట్రలా ఈ నిర్ణయం వెలువడింది. ఈ సందర్భంగా క్విడ్‌ప్రోకో పద్ధతిలో పెట్టుబడులు రాబట్టారని ఇడి హైదరాబాద్ ప్రాంత జాయింట్ డైరెక్టర్ ఎస్ఎ ఉమాశంకర్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా జారీ చేసిన ప్రకటనలో జగన్‌పై వున్న ఆరోపణలు ఆయన భార్య భారతీ రెడ్డి ఆద్వర్యంలో నడుస్తున్న భారతీ సిమెంట్‌కు అక్రమంగా గనుల కేటాయింపు ి అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ తాజా అటాచ్మెంట్లో బంజరాహిల్స్‌లో ఆయన నివాసముండే లోటస్ పాండ్, సాక్షి భవనంతో సహా ఇంకా చాలా స్థిరాస్తులు చరాస్తులు కూడా వున్నాయి. గతంలో ఇది దాదాపు వెయ్యికోట్ల విలువైన ఆస్తులను కట్టడి చేసింది.ఇప్పుడు కూడా భారీగానే స్వాధీనం చేసుకుంది.జగన్‌పై వచ్చిన ఆరోపణల్లో మనీ లాండరింగ్ కేసులే తీవ్రమైనవని ఆయన లాయర్లు కూడా చెబుతూ వస్తున్నారు. అవి ఆయనను వెంటాడుతూనే వున్నాయని ఈ తాజా స్వాధీనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో ఏదో విధంగా తమ వారి ఆత్మ విశ్వాసం నిలబెట్టేందుకు వరుసగా మీడియా గోష్టులు జరిపి రకరకాల సమస్యలు లేవనెత్తుతున్నారు. ఇదే కేసులో కోర్టులు నిందితులుగా వున్న ఐఎఎస్‌లను వదలివేస్తుంటే ఇంత భారీ అటాచ్మెంట్ ఏమిటని వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఏమైనా . ఇడి రంగ ప్రవేశం చేసిన తర్వాత ఆర్థిక నేరాలు అంత సులభంగా మటుమాయం కావన్నది అనుభవం. . ఇది బిజెపి రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు కూడా. తెలుగుదేశంపై రాజకీయ విమర్శలూ ప్రధాన ప్రతిపక్షంపై దాడులతో తమ అవకాశాలు పెంచుకోవడం అవసరమని మోడీ నాయకత్వం భావిస్తున్నదా? ఏది ఏమైనా ఇప్పటికి అయిదేళ్లు పూర్తిచేసుకున్న జగన్ కేసులు ఇకనైనా చకచకా కదులుతాయా? మెడమీద కత్తిలా ఆ కేసులున్నంత కాలం తమ నేత కొంత నియంత్రణలో వుండక తప్పదనే మాట వైసీపీ నేతలు అంటుంటారు. ఈ తాకిడితో మరికొంత మంది బయిటకు వెళ్లిపోవచ్చు. కాగా ఇప్పటికే తెలుగుదేశంలో చేరి ఎస్సికార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన జూపూడి ప్రభాకరరావు ఒకడుగు ముందుకు వేసి జగన్ విదేశాలకు పారిపోయే ప్రమాదం వుంది గనక పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోవాలని కోరడం ఆసక్తికరం. స్థానాలు మారినప్పుడు గానాలు కూడా మారడం రాజకీయాల్లో సహజమే. అందుకే ఒక దశలో జగన్‌ను అమితంగా సమర్థించిన జూపూడి వంటి వ్యక్తి ఇలా మాట్లాడ్డాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కాకపోతే విజరుమాల్యాను జగన్‌ను పోల్చడం కుదురుతుందా? ప్రతిపక్షనేత అంత భయపడాల్సిన తక్షణావసరం ఏముంది? బహుశా జూపూడిది అత్యుత్సాహమే కావచ్చు. హౌంమంత్రి చినరాజప్ప అయితే ఈ అటాచ్మెంట్ తర్వాత జగన్‌కు ప్రతిపక్ష స్థానం కూడా లేదన్నట్టు మాట్లాడారు. ఎవరి రాజకీయాలు ఎలా వున్నా విచారణ ప్రక్రియ ముగిసి తీర్పు వచ్చేదాకా ఆగాలి కదా?