ఎన్నికల ఎడాదిలో బీజేపీ విరాళాల పంట పండించుకుంది. ఆ పార్టీకి 2023-24లో ఏకంగా రూ. 2.244 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఈసీకి ఆ పార్టీ చెప్పింది. స్వతంత్ర భారతావనిలో ఓ పార్టీకి ఒకే పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడంతో ఇదే మొదటి సారి. బీజేపీ మాత్రమే ఇలాంటి మ్యాజిక్ చేయగలదు. అంతకు ముందు ఏడాదికి బీజేపీకి వచ్చింది రూ. 700 కోట్లు మాత్రమే.
దేశంలో బీజేపీ కి పోటీగా ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు అందులో పది శాతం మాత్రమే వచ్చాయి. 289 కోట్లరూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అయితే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి చాలా ఎక్కువే. అంతకు ముందు ఏడాది కేవలం డెభ్బై కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాని కన్నా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన విరాళాలు చాలా ఎక్కువ. భారత రాష్ట్ర సమితి అత్యధికంగా రూ.495.5 కోట్లు పొందింది. వైఎస్సార్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు విరాళాలను పొందింది.
ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వాత రాజకీయ పార్టీలుతమ వార్షిక విరాళాల వివరాలను ఈసీకి సమర్పించాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. ఈ ట్రస్టు నుంచి బీజేపీకి రూ.723.6 కోట్లు రాగా, కాంగ్రెస్ కు రూ.156.4 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం విరాళాల్లో మూడింట ఒక వంతు బీజేపీకి దక్కాయి. మొత్తం అన్ని పార్టీలకు కలిపి వచ్చిన విరాళాల కంటే.. బీజేపీ ఒక్క పార్టీకి వచ్చినవే ఎక్కువ.