వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారు. వారు తెలంగాణ రాష్ట్ర సీఎంను ఎందుకు రెచ్చగొట్టాలనుకుంటున్నారో కానీ రేవంత్ కన్నెర్ర చేస్తే జగన్ ఆస్తులకు ముప్పు ఏర్పడుతుందన్న సంగతిని మార్చిపోతున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్టు విషయంలో వైసీపీ అధికార ప్రతినిధిగా మారి ఆరె శ్యామల రేవంత్ రెడ్డి సర్కార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అది అలా ఉండగానే తాజాగా అంబటి రాంబాబు సమస్య పరిష్కారం కావాలంటే సోఫా రావాల్సిందేనని ట్వీట్ పెట్టారు.
అంబటి రాంబాబ ఉద్దేశం రేవంత్ రెడ్డి లంచగొండి అని.. ఆయన డబ్బులు వసూలుచేయడానికే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడం. ఆయన ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నాయి. వైసీపీ పెద్దల అనుమతి లేకుండా రేవంత్ రెడ్డిని అటు శ్యామల..ఇటు అంబటి రాంబాబు ఒకే సారి టార్గెట్ చేయరని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ వ్యూహం ఏమిటన్నది మాత్రం బయటకు రాలేదు.
తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటాడని. జగన్ హైదరాబాద్ వైపు రావడం లేదు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఆయనకు చాలా ఆస్తులు, బినామీ ఆస్తులు ఉన్నాయి. ఇలా రేవంత్ ను రెచ్చగొడితే జగన్ ఆస్తులు, బినామీ ఆస్తుల లెక్క తేలుస్తారని అప్పుడు కూడా ఈ ఇద్దరూ అలాగే మాట్లాడాలని సెటైర్లు వేస్తున్నారు కొంత మంది.