కాలం ఎంత బలమైనదో జనసేన పార్టీకి 2024 మరో రూపంలో చూపించింది. పార్టీ పెట్టి పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిన జనసేన రియల్ సూపర్ స్టార్ గా 2024లో నిలిచింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ సీట్లు ఉన్న పార్టీ. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పవర్ ఫుల్ రోల్ లో ఉన్నారు. వైసీపీ హయాంలో ఉన్న డిప్యూటీ సీఎం పోస్టు కాదు ఇది.
పవన్ కల్యాణ్‌కు ఆవేశం ఎక్కువ.. ఆ ఆవేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగా జనసేన ఎప్పటికీ బలపడదు అని రాజకీయవర్గాలు ఈ ఏడాది మొదటి వరకూ అంచనా వేస్తూ వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ ఆవేశం బయటే కానీ రాజకీయంగా ఆలోచన కూడా ఉంటుందని ఎవరు రెచ్చగొట్టినా తన రాజకీయం తాను చేస్తానని నిరూపించారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులు స్మూత్ గా ముందుకు తీసుకెళ్లారు. బీజేపీని కలుపుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. అందు కోసం కొన్ని సీట్లు త్యాగం చేశారు. దానికి తగ్గ ఫలితం వచ్చింది.
ఎన్నికల కౌంటింగ్ జరిగిన జూన్ మూడో తేదీన జనసేన పార్టీ బలంగా తన ఉనికిని చాటింది. జనసేన ఇంత బాగా ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. అందుకే జనసేన పార్టీకి ఇది తిరుగులేని సంవత్సరంగా మారింది. అధినేత రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారన్న ప్రచారం నుంచి ఆ పార్టీని శంకరగిరి మాన్యాలకు పట్టించిన పార్టీగా జనసేనను 2024 నిలిపింది. అంతే కాదు పవన్ కల్యాణ్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీలోనూ పలుకుబడి పెరిగింది.
జనసేన పార్టీ చరిత్రలో పవన్ కల్యాణ్ హిస్టరీలో.. 2024 ఓ బలమైన .. మరచిపోలేని సంవత్సవరంగా నమోదు అవుతుందనడంలో సందేహం లేదు.