వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో మద్యం అమ్మకాలు ఓ రేంజ్ లో ఉండేవి. ప్రభుత్వం మారి పాలసీ మార్చేయడంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. ఈ ఏడాది మద్యం అమ్మకాలు తెలంగాణలో తగ్గాయి. ముఖ్యంగా ఏపీకి దగ్గరగా ఉండే తెలంగాణలో మద్యం దుకాణాలకు గతంలో భారీ డిమాండ్ ఉండేది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో శివారు ప్రాంతాల్లో దుకాణాల కోసం ఎంతైనా వెచ్చించేవారు. కానీ ఇపుడు ఆయా దుకాణాలకు డిమాండ్ పడిపోయింది. ఏపీ నుంచి ఎవరూ మద్యం కోసం ప్రత్యేకంగా రాకపోతూండటమే కారణం.
ఏపీలో ఇప్పుడు అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ధరలు కూడా మరీ తక్కువేం లేవు. తెలంగాణతో పోలిస్తే సమానంగానే ఉన్నాయి. దీంతో మందుబాబుల అవసరాలు తీరిపోతున్నాయి. మందు కోసం మరో చోటకు పోవాల్సిన అవసరం.. చీప్ లిక్కర్ లేదా సారాయి కోసం వెంటబడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏపీలో మద్యం పాలసీ విషయంలో వైసీపీ విధానం వల్ల తాము బాగుడతామనుకున్న శివారు మద్యం దుకాణాలు ప్రభుత్వం మారే సరికి డీలాపడాల్సి వచ్చింది.
గతంలో ఏపీ మందుబాబుల్ని ప్రభుత్వం దోచుకుంది. అయినా చీప్ లిక్కర్ ను.. సొంత మద్యాన్ని అమ్మేవారు. తప్పని సరి పరిస్థితుల్లో వాటినే కొనుగోలు చేసేవారు. కాస్త ఓపిక ఉన్న వాళ్లు పొరుగు రాష్ట్రానికి వెళ్లేవారు. దీని వల్ల కర్ణాటక, తెలంగాణకు ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఆ ఆదాయం ఆయా రాష్ట్రాలకు తగ్గింది. ఏపీ మందుబాబులపై భారం తగ్గింది.