తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక్క సారిగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యారు. ఎక్కువ మంది ట్రోల్ చేశారు. కొంత మంది పొగిడారు. కానీ రాజకీయాల్లో ట్రోలింగ్ కూడా నెగెటివ్ పబ్లిసిటీగా రాజకీయ నేతల కు ఉపయోగపడతాయి. ప్రభుత్వంపై దూకుడుగా పోరాడటంతో మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఆయనకు ఫ్యూచర్ బీజేపీ జాతీయ నేతగా గుర్తింపు వచ్చింది.
అన్నామలై పోరాటం గురించి విస్తృత ప్రచారం జరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వంపై ఈ స్థాయిలో పోరాటాలు చేయాలని కోరుకుంటున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది తర్వాత ఇలాంటి వైల్డ్ పోరాటాలు చేస్తే ఎంతో ఊపు వస్తుందని వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో సలహాలిస్తున్నారు. జగన్ ఇలా లుంగీకట్టుకుని చొక్కా లేకుండా కొరడాతో కొట్టుకుంటే వచ్చే మైలేజీ ఊహించుకుని వైసీపీ క్యాడర్ పిచ్చెక్కిపోతున్నారు. జగన్ కూడా ఇలాంటి వైల్డ్ పోరాటాలు చేయాలని అనుకుంటున్నారు.
మరో వైపు తెలంగాణ లో కేటీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాంటివి అయితే ఎలా ఉంటుందన్న చర్చలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అయితే కేటీఆర్ డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేస్తారని అన్నామలై చేసింది కాస్త తేడాగా ఉందని ఎక్కువ మంది బీఆర్ఎస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయాల్లో మంచి మాట్లాడుకుంటున్నారా లేదా చెడు మాట్లాడుకుంటున్నారా అన్నది కాదు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఈ విషయంలో అన్నామలై ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఆయన బాటలో నడవాలని వైసీపీ ఫ్యాన్స్, బీఆర్ఎస్ ఫ్యాన్స్ తమ నేతలకు సహాలివ్వడం మాత్రం హైలెటే.