ఫ్యాన్స్ అంటే వారికి సినిమాలు ప్రయారిటీ. వారు పవన్ కల్యాణ్ ఎక్కడైనా కనిపిస్తే సినిమాల ప్రస్తావన తీసుకు వస్తారు. కానీ మీడియా ప్రతినిధులకు ఏమైంది?. పవన్ వెళ్లింది సినిమా ప్రోగ్రామ్‌కు కాదు అయినా.. సినిమాల టాపిక్ రిపోర్టర్లు తెస్తే ఇరిటేషన్ రాకుండా ఉంటుందా?. పవన్ కల్యాణ్ కడప పర్యటనలో అభిమానుల ఓజీ అరుపుల మధ్య మీడియా ప్రతినిధులు కూడా అసలు విషయాన్ని పక్కన పెట్టి సినిమా గురించి అడగడం వివాదాస్పదం అయింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాడికి గురైన ప్రభుత్వ ఉద్యోగిని పరామర్శించడానికి వచ్చారు . ఆ టాపిక్ పై ఇలా దాడులు చేస్తున్నవారికి డిప్యూటీ సీఎం హోదాలో హెచ్చరికలు జారీ చేశారు. అక్కడికి వచ్చిన అభిమానులు..ఓజీ పేరుతో నినాదాలు చేశారు. మీడియా ప్రతినిధులు ఈ టాపిక్ వదిలేసి సినిమా గురించి అడిగారు. సినిమాల ప్రస్తావన తెస్తున్న ఫ్యాన్స్‌పై చిరాకుపడుతున్నారు పవన్. ఆయన దృష్టి అంతా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రజల బతుకుల్ని మార్చడంపైనే ఉందని చెబుతున్నారు. అయినా ఓ రిపోర్టర్ మాత్రం సీరియస్ టాపిక్ టాపిక్ మధ్యలో సినిమాలో ప్రస్తావన తెచ్చారు. దాంతో పవన సీరియస్ అయ్యారు.
అభిమానులు కూడా పవన్ పాయింట్ ను పట్టుకోవడం లేదు. ముందు బతుకులు బాగుపడితే ఆ తర్వాత సినిమాలు అంటున్నారు. కడుపు నిండిన తర్వాతే సినిమాల ప్రస్తావన అని హితబోధ చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో, టీచర్లలో హీరోలను చూడాలని కోరుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడంలేదు. ఎక్కడిక్కడ పవన్ వారికి తెలిసేలా చెబుతున్నారు. కానీ మీడియా ప్రతినిధులు కూడా అదే పని చేస్తే ఎలా ? వీళ్లకు కామన్ సెన్స్ ఉండదా అని పవన్ అనుకుంటే అందులో తప్పెవరిది ?