రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని జనవరిలో అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కానీ అర్హులు ఎవరు అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. ఖచ్చితంగా అనర్హులకు అందకూడదని అనుకుంటోంది. కానీ దానికి పారామీటర్స్ ఎలా ఖరారు చేయాలో మాత్రం అర్థం కావడం లేదు. ఆదివారం మంత్రుల సబ్ కమిటీ గంటల తరబడి చర్చించినా ఓ నిర్ణయానికి రాలేకపోయార.ు
గత ప్రభుత్వం తన విధానంగా ప్రతి ఎకరాకూ పచ్చింది. భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సహా భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికి డబ్బులు ఇచ్చింది. కానీ ఈ విధానం పై అప్పట్లోనే విమర్శలు ఉన్నాయి. నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు అందుతున్నది కొంతేనని .. మిగతా అంతా భూస్వాముల ఖాతాల్లో పడుతోందన్న ఆరోపణల ఉన్నాయి. యాభై శాతానికిపైగా వ్యవసాయం చేసేది కౌలురైతులే. వారికి ఇవ్వకుండా భూయజమానులకు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి.
వీటన్నింటినీ కవర్ చేసి .. ప్రజల సొమ్మును అవసరమైన రైతులకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కష్టమైనా రూ. పది వేల కోట్ల వరకూ సమీకరించుకుంది.కోకాపేటలో భూములను తాకట్టు పెట్టి నిధులను సమీకరించినట్లుగా తెలుస్తోంది, రైతు భరోసా ఇవ్వడం ఖాయమే కానీ ఆ విధి విధానాల విషయంలో మాత్రం.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.