సినిమా మొదలెట్టడానికి డబ్బులుంటే సరిపోతుంది. కానీ షూటింగ్ సజావుగా సాగడానికీ, సినిమాని పూర్తి చేయడానికి దర్శకుడిలో క్లారిటీ ముఖ్యం! అది లేకపోతే, మొదలైన సినిమా మొదలైనట్టే ఉంటుంది. సరైన దర్శకుడ్ని ఎంపిక చేసుకోకపోయినా, స్క్రిప్టు విషయంలో గందరగోళానికి గురైనా.. అష్టకష్టాలూ పడాల్సివస్తుంది. రాజ్ తరుణ్‌కి ఈ విషయం అనుభవ పూర్వకంగా తెలుసొచ్చింది. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఏకె ఎంటర్ టైన్మెంట్స్ ఓ చిత్రాన్ని మొదలెట్టింది. వంశీ కృష్ణ దర్శకుడు. అయితే వంశీ కృష్ణకంటే ముందు.. ఓ దర్శకుడు ఈ ప్రాజెక్టులోకి వచ్చి వెళ్లిపోయాడు.
మొదట రాజ్ తరుణ్ స్నేహితుడైన ఓ కుర్రాడు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పది రోజుల పాటు షూటింగ్సాగింది. రషెస్ చూసుకొంటే రాజ్ తరుణ్ కి అది ఏమాత్రం నచ్చలేదు. అప్పటి వరకూ తీసిన ఫుటేజ్‌ని పక్కన పెట్టి.. వంశీ కృష్ణకు ఆ ప్రాజెక్టు అప్పగించారని తెలుస్తోంది. దొంగాట సినిమాతో మంచి పేరు తెచ్చుకొన్నాడు వంశీ కృష్ణ. ఇది తనకు రెండో సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది.