నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.. మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకొంటోంది. సోమవారం నుంచి జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరించనున్నారు. ఇప్పటి వరకూ యుద్ధ సన్నివేశాలనే తెరకెక్కించారు. క్లైమాక్స్ కూడా యుద్ధమే. ఆ షెడ్యూల్ పూర్తయితే… యాక్షన్ పార్ట్ పూర్తయిపోయినట్టే. ఆ తరవాత టాకీ మొదలవుతుంది. 40 రోజుల్లో టాకీని పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. జనవరి 14న ఈ సినిమాని విడుదల చేయాలన్నది క్రిష్ ఆలోచన. ఆ టైమ్‌కి ఈ గౌతమి పుత్ర సిద్ధం కావాలంటే షూటింగ్‌ని ఇంకా స్పీడప్ చేయాల్సిందే.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమాలో ఓ కీలక ఘట్టంలో బాలకృష్ణ సింహాలతో తలపడే సన్నివేశం ఉందట. తెలుగు సినిమాల్లో హీరో… పులలతో ఫైటింగ్ చేయడం చూశాం. అయితే అలాంటి సన్నివేశాలను భిన్నంగా ఈసీన్ని తెరకెక్కించాలన్నది చిత్రబృందం ఆలతోచన. అందుకు సంబంధించి హాలీవుడ్ నిపుణులతో క్రిష్సుదీర్ఘంగా చర్చలు జరిపారని, సన్నివేశం సహజంగా రావడం కోసం కొత్త టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడుకొంటున్నారని టాక్. బాలయ్య సింహాలతో తలపడే సన్నివేశం .. ఈ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుందని టాక్. బాలయ్యకు అసలే సింహా సెంటిమెంట్. దాన్ని ఈ సినిమాలో ఇలా కంటిన్యూ చేస్తున్నాడన్నమాట.