కార్యకర్తల్ని కాలి కింద చెప్పుల్లా తొక్కేసిన జగన్ రెడ్డి ఇక నుంచి గొప్పగా చూస్తామని నెత్తిన పెట్టుకుంటామని అంటున్నారు. బెంగళూరు నుంచి మూడు రోజుల క్యాంప్ కోసం తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన ఆయన నెల్లూరు నుంచి కార్యకర్తలను పిలిపించుకుని అందరికీ వేసే క్యాసెట్ వేశారు. ఎప్పట్లాగే బిర్యానీ , పలావు కబుర్లు చెప్పారు. జగన్ ఉన్నప్పుడు పలావు పెట్టాడు.ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. జగన్ పెడుతున్న పలావూ పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. మన ప్లేట్లో మన బిర్యానీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక రోడ్డున పడేసిన విషయం అందరికీ తెలిసినా ఆయన రైటర్ ఎవరో కానీ పదే పదే దీన్ని గుర్తు చేసేలా రాసి జగన్ నోటితో చదివిస్తున్నారు.
పథకాల గురించి ఆవు వ్యాసం చదివిన తర్వాత ఈ సారి కొత్తగా కార్యకర్తల కోసం ఓ పేరా రాసుకొచ్చారు. కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.ఇకపై మరోలా చూస్తామని చెప్పుకొచ్చారు. ఇక నుంచి వారిని గొప్పగా చూస్తామని ఈ విషయంలో మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉందన్నారు. వైయస్సార్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామని.. .అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతామన్నారు.
ఇక లండన్ పోతున్న జగన్ రెడ్డి సంక్రాంతి తర్వాత చేపడతానన్న జిల్లాల యాత్రలపై నాలుక మడతేశారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తానని.. అక్కడే నిద్ర చేస్తాను.ప్రతి వారం మూడు రోజులు మంగళ,బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటులో విడిది చేస్తానని చెప్పుకొచ్చారు. . ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటానన్నారు. జగన్ రెడ్డి సమావేశాలకు ముఖ్యమైన నేతలు కూడా రావడం లేదు.