వైసీపీలోని సన్నిహితులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు మంత్రి పార్థసారధిని వీడటం లేదు. జోగి రమేష్తో కలిసి ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై వచ్చిన వివాదంతో ఆయన క్షమాపణలిు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన నూజినీడు నియోజకవర్గంలో కొడాలి, వంశీ అనుచరులకు మైనింగ్ చేసుకునే చాన్సిచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల్ని ఎవరో సాధారణ నేత చేయలేదు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేశారు. దీంతో కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి దుమారం రేగింది.
వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పరారయ్యారు. ఆయన నియోజకవర్గానికి రావడం లేదు. ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. ఆయన కీలకమైన అనుచరులది కూడా అదే పరిస్థితి. ఐదేళ్ల పాటు నియోజకవర్గాన్ని దున్నేసిన వారికి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఎదురయింది. అందుకే వారు పక్క నియోజకవర్గాలపై దృష్టి పెట్టారని అంటున్నారు. నూజివీడు మంత్రి పార్థసారధి పెనుమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న వారికి .. నూజివీడులో మైనింగ్ చేసుకునే చాన్స్ ఇస్తున్నారని అంటున్నారు.
కొడాలి నాని, వంశీలు ఏ మాత్రం బలపడాలని. ఆర్థికంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరగాలని యార్లగడ్డ వెంకట్రావు అనుకోవడంలేదు. అందుకే చాలా సీరియస్ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అయితే మంత్రి పార్థసారధి వర్గీయులు మాత్రం.. వైసీపీ నేతలెవరూ మైనింగ్ చేయడం లేదని వాదిస్తున్నారు. గతంలోలా రాజకీయాలు చేయలేని పరిస్థితిని జగన్ సృష్టించారు. ఇతర పార్టీల్లో ఉన్న వారికి చిన్న సాయం చేసినా ప్రస్తుత పార్టీ సహించలేని పరిస్థితి ఉంది. దీన్ని పార్థసారధి గుర్తించాల్సి ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.