అనిల్ రావిపూడి సక్సెస్ రేటు బావుంటుంది. దాదాపు ఆయన సినిమాలన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. దిల్ రాజు ఆస్థాన డైరెక్టర్ గా ఆయనకి మంచి విజయాలు వున్నాయి. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం సినిమాతో రెడీ అయ్యారు. ఇంతముందు అదే బ్యానర్ లో వెంకటేష్ తో ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు చేశారు. తెలుగులో అదొక సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ అయ్యింది.
ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ని కూడా ఫ్రాంచైజ్ గా మలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి చెప్పారు.”ఎఫ్2 లానే సంక్రాంతి వస్తున్నాం కూడా సీక్వెల్స్ తీయడానికి, కథని కొనసాగించడానికి మంచి అవకాశం వుంది. నాకైతే ఇందులో మరో సినిమా చేయాలనే వుంది’ అని చెప్పారు అనిల్.
అనిల్ మంచి కామెడీ టైమింగ్ వున్న డైరెక్టర్. ఆయన సినిమాలన్నీ ఈవివి మోడల్ లో వుంటాయి. ఆ మార్క్ ని ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా అందించడంలో మంచి పనితనం కనబరుస్తున్నాడు. సంక్రాంతి వస్తున్నాం కథ ఫ్యామిలీ ఆడియన్స్ రిలేట్ చేసుకునేలాంటిదే. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్. ఈ సినిమా వర్క్ అవుట్ ఐతే గనక దిల్ రాజ్ బ్యానర్ కి మరో ఫ్రాంచైజ్ దొరికేసినట్లే.