రఘురామకృష్ణరాజును ఎలాగైనా కొట్టాలి..లేకపోతే కొట్టించాలి అనే మానసిక అనారోగ్య కోరికను తీర్చుకున్న జగన్ దెబ్బకు ఎంత మంది జైలుకు వెళ్తున్నారో చెప్పాల్సిన పని లేదు. తనను కొట్టారని బయటకు చెప్పుకోరని .. రఘురామ గురించి అనుకున్నారు. కానీ తనను కొట్టిన వారిని జైలుకు పంపేదాకా ఊరుకోనని ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి జైలుకెళ్లే ప్రమాదంలో పడ్డారు. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు.. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఈ ప్రభావతి సీనియర్ వైద్యురాలు. అంతే కాదు వైసీపీ నాయకుడి భార్య. అదే సందు అనుకుని.. తనకు గుంటూరు ఆస్పత్రిపై పెత్తనం కావాలని అడిగారు. దానికేముంది తీసుకోండి అని జగన్ ఇచ్చేశారు. కానీ తప్పుడు పనులు చేయాల్సి ఉంటుందని తర్వాత తెలిసింది. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి తీసుకొచ్చి కొట్టిన రోజున కోర్టు వైద్య పరీక్షలకు పంపితే.. తప్పుడు నివేదికలు ఇచ్చారు. రిపోర్టులను ట్యాంపరింగ్ చేశారు. ఇన్ని చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఆ పదవి లేదు. కానీ ఇంత బతుకు బతికీ జైలుకెళ్లాసిన దుస్థితికి వచ్చింది.
ఎంత ఉన్నత చదువులు చదివాము అన్నది కాదు.. అడ్డగోలుగా పదవుల కోసం జగన్ రెడ్డి లాంటి వాళ్లను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తే ఎప్పటికైనా ఆ పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. డాక్టర్ ప్రభావతికి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆమెను చూసి రాజకీయ నాయకుల్ని నమ్మకూడదని ఏదైనా నిబంధనల ప్రకారమే చేయాలని ఇతర ఉద్యోగులు అయినా గుర్తించాలి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు. తనను ఎదిరించిన ఓ నాయకుడ్ని కొట్టించాలన్న ఓ లీడర్ మానసిక రోగం వల్ల ఎంతో మంది జైలుకెళ్తున్నారు. ఆ లీడర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు.