మీడియా చానల్ ఓనర్ అయిన బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి వచ్చింది. లేనిపోనివి ప్రచారం చేయకుండా.. ఆయన అందర్నీ కలిసి సహకరించాలని కోరారు. చివరికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీని కూడా కలిశారు. ఆయనకు ఎన్టీవీ ఓనర్ నరేంద్రనాథ్ తో రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయి. గతంలో ఒకరి జాతకాలు ఒకరం బయట పెట్టుకుంటామని టీవీల్లో ప్రోమోలు వేసుకున్నారు. తర్వాత ఎందుకో రాజీపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నరేంద్రనాథ కు ఏ పదవి రాలేదు..కానీ టీవీ5 చైర్మన్ కు చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇప్పుడు తన మీడియా పవర్ ను ఆయన వ్యతిరేకులు చూపించడం ప్రారంభించారు. తొక్కిసలాట ఘటనతో … బీఆర్ నాయుడ్ని టార్గెట్ చేసేందుకు ఎన్టీవీతోపాటు.. ఆంద్రజ్యోతి కూడా ప్రయత్నిస్తున్నాయి. టీటీడీలో పాలన సరిగ్గా లేదని ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ నాయుడు యథాలాపంగా చేసే వ్యాఖ్యలను కూడా హైలెట్ చేసి.. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా ప్రచారం చేయడంతో ఆయన వెంటనే రెండో సారి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాల్సిన వచ్చింది.
నిజానికి బీఆర్ నాయుడు చాలా వరకూ వ్యాపారగొడవలు ఉన్న ఎన్టీవీ చైర్మన్ లాంటి వారితో కాకుండా ఇతరులతో సౌమ్యంగా ఉంటున్నారు. అలా ఉండటమే ఆయన తప్పు అయిందేమో కానీ.. ఆనను అందరూ టార్గెట్ చేసుకుంటారు. రాజకీయాల్లో ఆయన లేరు కానీ.. టీటీడీ చైర్మన్ పదవి కాలంగా రాజకీయాలకు ఇబ్బంది పడుతున్నారు. ఓ మీడియా చైర్మన్ అధిపతికి వచ్చిన అవకాశాన్ని చెడగొట్టడానికి..ఇతర మీడియా సంస్థలు ప్రయత్నం చేయడం.. వారిలో ఐక్యత లేదని అనుకోవడానికి సాక్ష్యం.