డిప్యూటీ సీఎం పవన్ పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు మళ్లీ వాడు, వీడు అంటూ స్పందించడం ప్రారంభించారు. కర్నూలులో గ్రీన్ కో పరిశ్రమను పరిశీలించినప్పుడు మీడియా సమావేశంలో పండగ తర్వాత కడప, రాజంపేటలో ప్రత్యేక డ్రైవర్ నిర్వహిస్తామని కబ్జా చేసిన భూములను కక్కిస్తామని ప్రకటించారు. దీనిపై అంబటి అసహనంతో స్పందించారు.
సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి అని వ్యాఖ్యానించారు. అంతటితో వదిలి పెట్టలేదు. అన్యాయాలు, అక్రమాలు చేస్తే చర్యలు తీసుకునే అధికారానికి చట్టానికి ఉందన్నారు. తప్పులు చేసి క్షమాపణలు చెప్పి.. ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన వారు ఏం కక్కిస్తారని ప్రశ్నించారు. తాటతీస్తాను.. నిల్చోబెడతాను.. కూర్చోబెడతాను అంటున్నారని.. ఆయనమైనా హెడ్ మాస్టరా అని ప్రశ్నించారు. తొక్కిసలాట విషయంలో చేతకాని కబుర్లు అన్నీ చెబుతున్నారని అన్నారు.
తోలు, తాట తీస్తానను అనే మాటలు మాట్లాడాలని ఎవరన్నా చెప్పాలని సలహా ఇచ్చారు. ఆయన డిప్యూటీ సీఎం.. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని చట్టానికి అనుగుణంగా మాట్లాడేలా నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. అవన్నీ సినిమాల్లో చెప్పుకుంటే ఈలలు వేస్తారన్నారు. పవన్ కల్యాణ్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏమీ వాడలేదు.కానీ వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి భాష వాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వేసే ప్రశ్నలకు చురుకుపడుతున్న అంబటి మాత్రం.. తోలు తీస్తాను.. తాట తీస్తాను..సీజ్ చేస్తాను అంటేనే.. క్లాస్ పీకేందుకు రెడీ అవుతున్నారు. ఇందులోనూ వాడు, వీడు అంటూ మళ్లీ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు.