రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు. కానీ తనకు నచ్చింది మాత్రం చేసుకొంటూ పోతాడు. అది ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అనేది అనవసరం. ఎంచుకొన్న కథలు, సినిమాలు తీసే విధానం.. అంతా తనిష్టమే. రక్త చరిత్ర టైమ్లో వర్మకు పాడు బుద్దేసి.. ఓ పాట పాటేశాడు. కత్తులతో సావాసం.. అంటూ వర్మ పాట ఆలపించిన పద్ధతి చూస్తే, అది పాట కాదు.. ఫైటు అనేంత భయంకరంగా కనిపించింది. వర్మ… ఇంకెప్పుడూ పాడకమ్మా.. అంటూ సెటైర్లు వేసుకొన్నారంతా. మళ్లీ ఇప్పుడు వర్మ పాట పాడే సాహసం చేస్తున్నట్టు టాక్.
రాంగోపాల్ వర్మ వంగవీటి అనే సినిమా తీస్తున్నాడిప్పుడు. విజయవాడ రాజకీయాల చుట్టూ సాగే కథ ఇది. ఈ సినిమా కోసం వర్మ మళ్లీ గొంతెత్తి ఓ పాట పాడేశాడట. ముందుగా ఆ పాటతోనే ప్రచార పర్వం ప్రారంభిస్తారని తెలుస్తోంది. సిరాశ్రీ రాసిన ఈ గీతాన్ని ఇటీవలే రికార్డు చేసినట్టు తెలుస్తోంది. రక్త చరిత్ర దెబ్బకి ఆడియన్స్ చెవుల్లోంచి రక్తాలొచ్చేశాయ్. మరి ఈసారి వర్మ పాట ఎన్ని కష్టాల్ని కొనితెస్తుందో..??