కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగల్లేదని ఆయనే పిటిషన్ ఉపసంహరించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ తగల్లేదని గతంలో రాహుల్, సోనియా కూడా పిటిషన్లు ఉపసంహరించుకున్నారు కదా అని కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నారు. కారణం ఏదైనా సుప్రీంకోర్టులో అసలు పిటిషన్ విచారణకు తీసుకునేందుకు నిరాకరించడం కేటీఆర్కు అసలు పెద్ద షాక్. విచారణ జరిపి కుదరదని చెప్పినా ఓ అర్థం ఉండేది కానీ.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా సమర్థిస్తున్నట్లుగా.. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేయడం కేటీఆర్కు అంచనా వేయలేని షాక్.
సుప్రీంకోర్టులో కనీసం అరెస్టు నుంచి ఉపశమనం లభిస్తుందని బీఆర్ఎస్ క్యాంప్ ఆశలు పెట్టుకుంది. కానీ అలాంటి అవకాశాల్లేవని తేలిపోయింది. ఇప్పుుడు కేటీఆర్ ముందు చూపు లేకుండా చేసిన న్యాయపోరాటం వల్ల అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆయనను అరెస్టు చేసినా బెయిల్ అంత తేలికగా వచ్చే అవకాశం ఉండదు. కేసులో ఆయన ఏ వన్ గా ఉన్నారు. తానే స్వయంగా డబ్బులు రిలీజ్ చేసేందుకు సంతకం పెట్టానని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు ఇక సమర్థించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది.
మరో వైపు ఈడీ విచారణకు కూడా వెళ్లాలని కేటీఆర్ అనుకోలేదు. కోర్టుల్లో క్వాష్ చేస్తారని అప్పుడు ఈడీ కేసు కూడా నడవదని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఈడీ అరెస్టు చేసినా ఏం చేయలేని పరిస్థితి . ఏసీబీ అరెస్టు చేస్తే కాస్త వేగంగా బెయిల్ తెచ్చుకోవచ్చు కానీ ఈడీ అరెస్టు చేస్తే మాత్రం.. చాలా రోజుల పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఈడీ అరెస్టు చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. విదేశీ కంపెనీకి పంపిన నగదు.. రూటింగ్ జరిగి..అవి అనుమానాస్పద ఖాతాలకు చేరి ఉంటే మాత్రం.. ఈడీ కేసు చాలా పెద్దది అవుతుందని అనుకోవచ్చు.