బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఏసీబీ ఆఫీసు ముందు హైడ్రామా నడిపినట్లుగా ఇక్కడ అలా చేయడానికి అవకాశంలేదు. ఏసీబీ ఆఫీసుకు వెళ్లిన కేటీఆర్ తన లాయర్ కు అనుమతి ఇవ్వకపోతే విచారణకు రానని చెప్పి వెనక్కి వెళ్లారు . తర్వాత విచారణ చూసేందుకు హైకోర్టు అనుమతి తెచ్చుకుని విచారణకు వెళ్లారు. ఇప్పుడు ఈడీ విచారణకు కూడా లాయర్ ను తీసుకెళ్లాలని కేటీఆర్ అనుకునే అవకాశం ఉంది. కానీ ఈడీ మాత్రం ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయదని చెబుతున్నారు.
కేటీఆర్ కూడా ఈడీ ఎదుట ఎలాంటి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించకపోవచ్చు. ఈడీ వ్యవహారాలు చాలా కఠినంగా ఉంటాయని ఆయనకు క్లారిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కవితను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ వ్యవహరించిన విధానం వివాదాస్పదమయింది. ఆయనపై ఈడీ అధికారి ఫిర్యాదు కూడా చేశారు. అప్పుడు కవితకు మద్దతుగా వెళ్లారు. ఇప్పుడు తాను స్వయంగా ఈడీ కేసులో విచారణకు వెళ్తున్నారు.
గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు తనకు సమయం కావాలని అడిగారు. రెండో సారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు లాయర్ అనుమతి పేరుతో విచారణకు వెళ్లకపోతే ఈడీ సీరియస్ గా తీసుకుంటుంది. లాయర్ ను అనుమతించాలన్న రూల్స్ ఎక్కడా లేవు. హైకోర్టు ఉత్తర్వులు కూడా కేవలం ఏసీబీ విచారణ వరకే. ఈడీ విచారణ విషయంలో కేటీఆర్ రాజకీయం. చేసుకోకపోతేనే బెటర్ అన్న అభిప్రాయం బీఆర్ఎస్లో ఉంది. కానీ కేటీఆర్ మాత్రం.. భారీ జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేయబోతున్నారో ?