కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఇవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది.
అమిత్ షా పర్యటన కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అమిత్ షా టూర్ లో పాల్గొంటారు. సాధారణంగా రాజకీయాలను అమిత్ షా నే పట్టించుకుంటంటారు. పాలన పరంగా మోదీ బీజీగా ఉంటారు. అంతిమ నిర్ణయం తీసుకునేది మోదీనే అయినా.. అసలు పనులన్నీ చక్కబెట్టేది అమిత్ షానే. ఈ క్రమంలో ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడు నెలలు గడుస్తోంది. పరిస్థితుల్ని చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కొన్ని పొలిటికల్ సెటిల్మెంట్స్ కూడా పూర్తి చేయాల్సి ఉందని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. వైసీపీ నిర్వాకాల కారణంగా ఎన్నో బ్యాక్ లాగ్స్ పెండింగ్ లో ఉన్నాయని .. వాటిని క్లియర్ చేయాల్సి ఉందని అంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై రిపోర్టులు రెడీగా ఉన్నాయి. కొన్నింటిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్ మెంట్ అత్యవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్నింటిపై చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.