బ్రహ్మానందం తనయుడు గౌతమ్ చాలా కాలం తరవాత ఓ సినిమా చేశాడు. అదే బ్రహ్మానందం. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు టీజర్ వచ్చింది.
ఇదో తాతా మనవళ్ల కథ. గౌతమ్ తాతయ్యగా బ్రహ్మానందం నటించడం విశేషం. టీజర్ చాలా ఫన్నీగా, లైవ్లీగా ఉంది. బిల్డప్పులు ఇచ్చి బతికేసే యువకుడిగా గౌతమ్ పాత్ర తీర్చిదిద్దారు. తను చెప్పేది ఒకటి, చేసేది మరోకటి. ఆ పాత్రని పరిచయం చేసిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్ స్టైల్ ఆఫ్ కామెడీ ఈ సినిమాలో చూసే అవకాశం ఉందన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతోంది. బ్రహ్మానందం పాత్రని కూడా వెరైటీగా డిజైన్ చేశారు. ఎంత ఫన్ అయినా చివర్లో ఎమోషన్ పండించాల్సిందే. టీజర్లోనూ ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. తాత మనవళ్ల బాండింగ్ ని ఓ కొత్త స్థాయిలో చూపించబోతున్నారన్న హింట్ ఈ టీజర్ ఇచ్చేసింది. ఆర్.వీ.ఎస్. నిఖిల్ ఈ చిత్రానికి దర్శకుడు. మసూధ లాంటి డీసెంట్ సినిమా తీసిన రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించారు. టెక్నికల్ టీమ్ అంతా దాదాపుగా కొత్తవారే. ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ పూర్తి చేశారు. సినిమా విడుదల మరో నెల రోజులే బాకీ. ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రమోషన్లు చాలా కీలకం. అందుకే నెల రోజుల ముందు నుంచే ఈ టీమ్ ప్రచార పర్వాన్ని మొదలెట్టేసింది. మరి గౌతమ్ కమ్ బ్యాక్ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.