మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి. ఏపీ ఐపీఎస్ అధికారి . ఈయన ఐపీఎస్ అని చెప్పుకోవడం కన్నా వైఎస్ ఇంట్లో పని మనిషిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడరు. అంతగా బరి తెగించిన ఐపీఎస్ అధికారి. ఆయనకు మొదట ప్రాధాన్య పోస్టులు ఇచ్చిన జగన్ తర్వాత తాము చెప్పింది కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాడని పక్కన పెట్టింది. చివరికి మీడియాతో మాట్లాడారని చెప్పి షోకాజు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైఎస్ కుటుంబ విధేయత, నిర్వాకాల గురించి చెప్పుకుంటే చాంతాడంత ్వుతుంది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడనని.. జగన్ పై పెట్టిన కేసులు అక్రమం అంటూ.. రాజకీయ నాయకుడి స్టైల్లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పిన ఘనత ఆయన సొంతం. విధేయుడు కదా అని జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కీలక పోస్టులు కేటాయించారు. అలాంటి వాటిలో ఆర్టీసీ ఎండీ పోస్టు కూడా ఒకటి. ఇటీవల డీజీపీ తిరుమలరావును విమర్శిస్తూ జగన్ ఓ మాట అన్నారు. ఆయనకు కూడా ప్రాధాన్య పోస్టు ఇచ్చామని అయినా మా పై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. జగన్ చెప్పిన ఆ ప్రాధాన్య పోస్టు ఆర్టీసీ ఎండీ. అలాంటి పోస్టును మొదట మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఇచ్చారు జగన్. కానీ తర్వాత హఠాత్తుగా తీసేశారు. మొదట ఏపీఐఐసీ ఎండీ పోస్టు కూడా ఇచ్చారు.
అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి చాలా మాట్లాడారు. అలా ప్రెస్‌మీట్ పెట్టడం.. సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని తేల్చి..ఆయనకు ఇచ్చిన అప్రాధాన్య శాఖ నుంచి కూడా తొలగించి.. జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. మాదిరెడ్డి ప్రతాప్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. జగన్ పై ఎంత విధేయత చూపినా ఆయన కాటు వేయడంతో ఇప్పటి ప్రభుత్వం కాపాడింది. ఆయన గౌరవంగా రిటైరయ్యేందుకు సహకరిస్తోంది.